తెలుగుదేశంపార్టీ నేతలు చెబుతున్న విషయం చూస్తుంటే అదే అనుమానం వస్తోంది.  పార్టీలోని సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ  జేసి ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ బిజెపితో తాళి కట్టించుకుంటుందన్నారు. బిజెపితో కలిసి పనిచేస్తామన్నారు. తొందరలోనే బిజెపిలో తెలుగుదేశంపార్టీ విలీనమైపోతుందనే సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

తాము కొత్తగా ఇపుడే బిజెపితో జతకట్టేదేమీ లేదని గడచిన ఐదేళ్ళుగా బిజెపితో కలిసి పనిచేస్తున్నట్లే అన్నారు. ఐదేళ్ళుగా బిజెపితో ప్రేమాయణం సాగించిన తాము తాజాగా తాళి  కట్టించుకుని సంసారమే చేయబోతున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అసెంబ్లీలో బిజెపితో తమ ఎంఎల్ఏలు కలవటం కాదని ఏకంగా విలీనమే జరిగిపోతుందన్నారు.

 

రాజకీయాల్లో శాస్వత మిత్రులు, శతృవులు లేరని చెబుతునే ప్రధానమంత్రి నరేంద్రమోడికి చంద్రబాబునాయుడు లాంటి సీనియర్ నేతల సలహాలు చాలా అవసరమన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నపుడే జేసి ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

 

అనంతపురం జిల్లాలోని ధర్మవరం మాజీ ఎంఎల్ఏ వరదాపుం సూరి ఈమధ్యనే టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తమను కూడా బిజెపిలో చేరమని ఆఫర్ వచ్చిందని జేసి సోదరులు ఈమధ్యనే  చెప్పారు. అయితే ఆఫర్ పై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని కూడా మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి చెప్పటం అప్పట్లో సంచలనమైంది. తాజాగా జేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే తొందరలోనే జేసి కుటుంబం బిజెపిలో చేరటం ఖాయమనే అనిపిస్తోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: