దేశంలో రోజు రోజుకీ మహిళలపై చివరికి చిన్నారులపై దారుణమైన అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కామాంధులు రెచ్చిపోతున్నారు.  కఠిన చట్టాలు అమల్లో ఉన్న కన్నూ మీన్నూకానరాకుండా చిన్నారులపై అత్యాచారాలు చేస్తూ దారుణంగా చంపేస్తున్నారు.  ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో 9 నెలల చిన్నారిపై, 5 సంవత్సరాల చిన్నారులపై అత్యాచారాలకు పాల్పపడ్డ సంగతి తెలిసిందే.  తాజాగా ముక్కుపచ్చలారని చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఇకపై ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు పోక్సో చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో మరికొన్ని ఉన్నాయి. దేశంలోని సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం ‘కార్మిక రక్షణ కోడ్‌’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. చిన్నారులపై లైంగిక నేరాలకు ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని సవరించనున్నారు. దీంతోపాటు చైల్డ్ పోర్నోగ్రఫీకి జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు.

ఈ కోడ్‌లోకి 13 కేంద్ర కార్మిక చట్టాలను తీసుకురానున్నారు. దీనివల్ల వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ తదితర రంగాల కార్మికులకు మేలు జరగనుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇకముందైన చిన్నారులపై అఘాయిత్యాలు ఆగిపోవాలని మహిళా సంఘాలు, బాధిత తల్లిదండ్రులు కోరకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: