ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో సీఎం జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ ద్వారా తనను అవమానపరచాలని చూస్తున్నారన్నారు. జగన్ దూకుడుగా.. తొందరపాటు ధోరణితో వెళ్తున్నారని ఆక్షేపించారు.


జగన్ దూకుడు మంచిది కాదు.. ఆయన వయస్సు నా అనుభవం అంత.. అంటూ ఘాటు కామెంట్లు చేశారు. సాగునీటి విషయంలో తెలంగాణతో కలసి వెళ్లడంపై చంద్రబాబు సున్నితంగా విమర్శించారు. కలసిఉన్నప్పుడు బాగానే ఉంటుందని తేడా వస్తే దారుణంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.


సాగునీటి విషయంలో జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రానికి మంచిది కాదని చంద్రబాబు అన్నారు. సాగునీరు విషయంలో మన అడ్వాంజేట్ మనం చూసుకోవాలి..ఇతరులపై ఆధారపడొద్దు.. అని చంద్రబాబు సలహా ఇచ్చారు.


సాగునీటి రంగం జగన్ వ్యక్తిగత అంశం కాదని చంద్రబాబు అన్నారు. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బావుంటుందని సూచించారు. తనను ఇంతకు ముందు కూడా చాలా మంది విమర్శించారని.. విమర్శలు తనకు కొత్త కాదని చంద్రబాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: