2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత మంత్రివర్గంలో రోజాకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందని అందరూ భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రోజాకు మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు. సామాజిక సమీకరణల వలన ప్రస్తుత కేబినేట్లో రోజాకు చోటు దక్కలేదు. కానీ రెండున్నరేళ్ళ తరువాత వచ్చే కేబినేట్లో రోజాకు ఖచ్చితంగా స్థానం ఇవ్వబోతున్నట్లు జగన్ హామీ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. 
 
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తుంటే ఈ వార్తలు నిజమేనని తెలుస్తుంది. రోజాకు మంత్రి పదవి ఇవ్వనందుకు రెండు వారాల క్రిందటే ఏపీఐఐసీ చైర్మన్ గా నామినేటెడ్ పదవిని ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఏపీఐఐసీ చైర్మన్గా రోజాను నియమించటానికి ప్రభుత్వం తరపున ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ పదవిలో రోజాను కేవలం రెండేళ్ళ పాటు మాత్రమే కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చారు. 
 
రెండున్నరేళ్ళ తరువాత వచ్చే కేబినేట్లో రోజాకు చోటు పక్కా అయినందుకే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్గా కేవలం రెండేళ్ళ పదవి కాలాన్ని మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తుంది. వైసీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడిన రోజాకు భవిష్యత్తులో ఖచ్చితంగా మంత్రి పదవి లభించబోతూ ఉండడం రోజా అభిమానులకు కూడా ఎంతో సంతోషాన్ని కల్గించబోతుందని చెప్పవచ్చు. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: