ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారిపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆర్థిక మంత్రి గారూ! మీరు శ్వేత పత్రాలు అన్నప్పుడే అవి ఆధారాలు లేకుండా ఉంటాయని, సాక్షి కథనాల్లా స్పష్టత లేకుండా ఉంటాయని ముందుగానే ఊహించామని అన్నారు. కాగితాల్లో కనిపించిన అభివృధ్ధి ఫీల్డులో కనిపంచట్లేదు అంటున్నారు. మీ శ్వేత పత్రంలో ఉన్నవి మీరే ఒప్పుకోనని అంటున్నారా అని ప్రశ్నించాడు. 
 
2018 - 19 బడ్జెట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పు 2లక్షల 49 వేల కోట్లు. కేంద్ర ఆర్థిక మంత్రిగారు కూడా పార్లమెంట్లో ఇదే విషయం గురించి చెప్పారు. మీరు మాత్రం 3 లక్షల 62 వేల కోట్లు అప్పు ఉందని చెపుతున్నారు. ఈ 45 రోజుల్లో మీ ప్రభుత్వం ఏమైనా ఈ అప్పు చేసిందా అని నారా లోకేశ్ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారిని ప్రశ్నించాడు. 
 
కానీ ఆర్థిక శాఖా మంత్రిపై ఇన్ని వ్యాఖ్యలు చేసిన లోకేశ్ ఈ ఐదేళ్ళలో అంత అప్పు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పట్లేదు. గత ఐదేళ్ళలో పథకాల అమలు కోసం ఇంత అప్పు ఎందుకు చేసారో మాత్రం చెప్పట్లేదు. పథకాలేమైనా సక్రమంగా అమలు జరిగాయా అంటే రుణమాఫీ కేవలం మూడు విడతలు మాత్రమే ప్రజలకు అందాయి. మరి రాష్ట్ర అభివృధ్ధి కోసం అంత అప్పు చేయడానికి కారణమేంటో లోకేశ్ చెబితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: