జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా తనదైన మార్క్ ను చూపిస్తూ ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు. అయితే అదే క్రమంలో జగన్ మరో సాహస నిర్ణయం తీసుకున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల్ని వీలైనంత త్వరగా ముగించటంతో పాటు.. ఇబ్బందికరంగా ఉండే అంశాల్ని చర్చ వరకు రానివ్వకుండా అధికారపక్షం ప్రయత్నిస్తుంటుంది. ఇందుకోసం గిలెటిన్ అయ్యేలా చేస్తుండటం మామూలే.


అందుకు భిన్నంగా జగన్ ఊహించని రీతిలో ఇచ్చిన హామీ ఇప్పుడు రాజకీయ వర్గాల్ని విస్మయానికి గురి చేస్తోంది.అసెంబ్లీని ఎన్ని రోజులైనా.. ఎంత సమయమైనా.. ఏ అంశంపై నైనా సరే చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి సందేహానికి సమాధానాలు చెబుతానని ఆయన వ్యాఖ్యానించారు. ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టేది లేదన్న ఆయన.. మరో కీలకమైన హామీని ఇచ్చారు.


సభలో ఏ ఒక్క బిల్లును గిలెటిన్ కానివ్వమని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఇంత ధైర్యంగా ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఇలాంటి హామీని ఇచ్చింది లేదని చెప్పాలి.ప్రతి బిల్లును చర్చకు వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వటం అంత తేలికైన విషయం కాదు. తన మీద తనకున్న నమ్మకంతో పాటు.. నిజాయితీగా ప్రజాసమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ఏదీ కూడా తప్పించుకునే ప్రయత్నం చేయదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: