జిల్లాకు చెందిన తాజా మాజీ ఎంపిటిసిలు, జడ్పిటిసి సభ్యులుకు 8 నెలల గౌర వేతనం అందలేదు. మండల పరిషత్ అధ్యక్షులు కూడా ఈ జాభితాలో ఉన్నారు. ఈ నెల 4 తో మండల పరిషత్ , జిల్లా పరిషత్ కాల పరిమితి ముగిసింది. ఈ నేపథ్యంలో వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన గౌర వేతనం అందుతుందని ఆశించినా... దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఒక్కొక్కరికి  రావాల్సిన మొత్తం చిన్నదే అయినా జిల్లా మొత్తం పరిశీలిస్తే సుమారు రూ.2 కోట్లు వరకు బకాయిలు పేరుకుపోయాయి.


 ప్రస్తుతం ఎంపిటిసిలు, జడ్పిటిసి సభ్యులు మాజీలైన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఈ బకాయిలు విడుదల చేస్తున్నా ? లేదా ? అనే సందిగ్ధం వారిలో నెలకొంది. జిల్లాలో 675 మంది ఎంపిటిసిలు, 38మంది జడ్పిటిసి సభ్యులు విధులు నిర్వహించేవారు. ఒక్కో  ఎంపిటిసి సభ్యునికి నెలకు రూ.3వేల రూపాయల చొప్పున 8 నెలలకు రూ.24వేల వంతున ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. జిల్లాలో675  మందికి రూ. 1.62 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. 
అలాగే గత ప్రభుత్వం ఒక్కో జడ్పిటిసి సభ్యునికి రూ.3 వేల గౌర వేత్త చెల్లించేది. జిల్లాలో 38 మంది  జడ్పిటిసి సభ్యులకు 8 నెలలకు రూ.48 వేల చొప్పున రూ.18,24,000 బకాయిలు రావాల్సి ఉంది. వాస్తవానికి గత ఐదేళ్లలో ప్రభుత్వం  విడుదల చేసే నిధులు వీరి గౌరవేతనాలకు సరిపడని పరిస్థితి,  బడ్జెక్ట్ లో వీరికి కేటాయించిన మొత్తం కేవలం పది నెలలకే సరిపడేది. నిధులు విడుదుల కాగానే ఆ మొత్తాన్ని  జడ్పిటిసి, ఎంపిటిసిలకు సర్దుబాటు చేసేవారు. ఈ నెల 4 తో వారి పదవీకాలం ముగియడంతో వేతన బకాయిలు సమస్య బయటపడింది. ప్రభుత్వం స్పందించి తమ బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: