ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజే హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి. అధికార, ప్రతిపక్షాలు రెండూ దూకుడుగానే ప్రవర్తిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా అధికారం కోల్పోయిన తెలుగుదేశం.. సరిగ్గా రెండు నెలలు కూడా కాకుండానే వైసీపీ సర్కారుపై అస్త్రాలు సంధిస్తోంది.


ఇక అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న విమర్శలు బలంగా వస్తున్నాయి. గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎలా నడిపిందో బహిరంగ రహస్యమే.. బోండా ఉమ వంటి నేతలు అరేయ్.. పాతేస్తా.. వంటి పదాలు అలవోకగా వాడేసినా ఎన్నడూ చర్యలు తీసుకున్న పాపాప పోలేదు.


గతంలో టీడీపీ హయాంలో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ పై కూడా టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. నువ్వు, నీ తండ్రి ఎన్ని లక్షలు మింగారో తెలియదా.. అందుకే జైలుకు వెళ్లావ్ అంటూ అవమానించారు. లక్షకోట్లు లక్ష కోట్లు.. అంటూ జోరుగా ప్రచారం చేశారు. కానీ అలాంటి సందర్భాల్లో ఎప్పుడూ జగన్ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి సానుభూతి కోసం ప్రయత్నించలేదు.


కానీ.. గురువారం.. జగన్ కాళేశ్వరం అంశంపై మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు సీఎంగా ఉన్నారు. మరి అప్పుడు చంద్రబాబు గాడిదలు కాశారా అని ఫ్లోలో అన్నందుకు ఇప్పుడు చంద్రబాబు నానా హంగామా చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి నానా రచ్చచేస్తున్నారు చంద్రబాబు. ఇది చూసే తెదేపా ఓవరాక్షన్ అస్సలు తగ్గలేదుగా అనుకుంటున్నారు జనం. 


మరింత సమాచారం తెలుసుకోండి: