ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు వాడివేడిగా సాగింది. కరువు, ప్రాజెక్టులపై జరుగుతున్న చర్చలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘాటు విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించేటప్పుడు చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అని జగన్ ప్రశ్నించారు.


జగన్ అలా గాడిదలు కాస్తున్నారా.. అన్నమాటను టీడీపీ భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేసింది. మాజీ ముఖ్యమంత్రి అంత మాట అంటారా అన్న రేంజ్ లోటీడీపీ శ్రేణులు విమర్శల దాడి ప్రారంభించారు. దీనిపై ఏకంగా చంద్రబాబు సాయంత్రం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టారు.


ఇక్కడ ఓ విషయం గమనించాలి.. జగన్ గాడిదలు కాస్తున్నారా.. అన్నమాట కాస్త వినడానికి ఇబ్బందిగా ఉన్నా.. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగింది అదే అని రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారెవరైనా చెబుతారు. కాళేశ్వరంతో సహా ఎగువ రాష్ట్రాలు కట్టుకుంటున్న ప్రాజెక్టులను ఆపేందుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో తెలుగుదేశం ఉండడం జగన్ విమర్శలకు బలమిస్తోంది.


గతంలో ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచుకుంటుంటే.. చూస్తూ ఊరుకున్నది కూడా చంద్రబాబే.. అప్పుడు సీఎంగా ఆయనే ఉన్నారు. దానికి తోడు దేవెగౌడను ప్రధానని చేసింది తానే అని చెప్పుకుంటారు.


ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే.. ఇంతటి భారీ ప్రాజెక్టును కేసీఆర్ కేవలం మూడేళ్లలో కట్టారు. అందులోనూ సొంత నిధులతో కట్టారు. అంత తక్కువ సమయంలో అన్ని అనుమతులూ సాధించి ఇంత భారీ ప్రాజెక్టు కట్టడం మామూలు విషయం కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: