అమెరికాలో ఎలక్షన్స్ పర్వం మొదలయ్యింది,2020 లో జరిగే ఎలక్షన్స్ కోసం అమెరికా రాజకీయాల్లో వేడి రాచుకుంటుంది. గత ఎలక్షన్స్ లో ప్రాంతీయత్వాన్ని రెచ్చగొట్టి అధ్యక్ష పీఠం ఎక్కాడు ట్రంప్, పదవిలో ఉన్నంత కాలం పక్క దేశాల మీద రాళ్లు రువ్వాడమే పనిగా పెట్టుకున్నాడు.
ట్రంప్ పాలనమీద అమెరికన్లు కూడా అసంతృప్తి తో నే ఉన్నారు అనేది అక్కడి ప్రజల అభిప్రాయం.
అయితే పదవీకాలం ముగియడంతో కొత్త కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నారు అమెరికా అధ్యక్షుడు.అమెరికాలో ఆరోగ్య చట్టాలు అక్కడి ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం తీసుకువచ్చిన కొత్త ఆదేశాలపై సంతకం చేసిన ట్రంప్...
దీని వల్ల కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, డయాలసిస్ సేవలు చాలా సులభంగా అందుతాయన్నారు. అయితే ఈ సందర్భంగా కిడ్నీలకు హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.ట్రంప్ కి గుండె స్థానం లో కిడ్నీ ఉందని అందుకే అలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
అమెరికన్ అధ్యక్ష పదవి కోసం ఈసారి పోటీ చాలా గట్టిగానే ఉంది. ఈసారి పోటీలో మన తెలుగు సంతతి కమల హర్రీస్ ఉన్నారు. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి రేస్ లో దూసుకు పోతున్నారు కమల హర్రీస్.


మరింత సమాచారం తెలుసుకోండి: