అధికారం శాశ్వతం అనుకున్నారు. ముఖ్యమంత్రి పదవి తన కుటుంబానికే దారాదత్తం చేద్దామనుకున్నారు. అమరావతి తన రాజ ప్రాసాదం అనుకున్నారు. తానొక శ్రీక్రిష్ణ దేవరాయల మాదిరిగా తన భజన బ్రుందంతో కీర్తించబడుతూ అభినవ  మహారాజుగా అవతరించారు. కానీ ప్రజాస్వామ్యంలో బొమ్మ తిరగబడుతుందని గ్రహించలేకపోయారు.


ఇపుడు సీన్ కట్ చేస్తే బాబు ప్రతిపక్షంలోకి వచ్చి పడ్డారు. జగన్ ఎన్నటికీ సీఎం కాలేరని గట్టినా నమ్మారు. అందుకే ఏ మాత్రం సంకోచం లేకుండా నవ్యాంధ్రను తన చిత్తం వచ్చినట్లుగా పాలించారు. ఎవరు ఏమీ అడగరని, అసలు ఏపీలో ప్రతిపక్షం లేదని కూడా విర్రవీగారు. ఇపుడు కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చేసరిగి బాబుగారికి దిమ్మ తిరిగింది.


అసెంబ్లీకి రావడమే సాహసం అనుకుంటే అక్కడ కూడా సీనియారిటీ వల్లిస్తూ బాబోరు చేస్తున్న కామెడీ అంతా ఇంతా కాదు, అతి తక్కువ ఎమ్మెల్యేలతో  బాబు గొంతు చాలా బలహీనమని ఇంకా గుర్తించలేకపోతున్నారు. అధికార పక్షం నుంచి విమర్శలు, కౌంటర్లు పడితే తట్టుకోలేకపోతున్నారు. మొత్తానికి బాబు గారు నాడు  ప్రతిపక్ష నేత జగన్ మీద తాను  ఎగదోసిన తీరుని ఇప్పటికైనా గుర్తు పెట్టుకున్నారో లేదో కానీ చూసిన ఏపీ జనం మాత్రం నీవు నేర్పిన విద్యయే బాబోరూ, ఇపుడు బోరుమనడం ఎందుకండీ అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: