గ్రామీణ ప్రాంతాల్లో ఏటా సకాలంలో వర్షాలు కురవక పోవడంతో వ్యవసాయ పనులు తగ్గిపోతున్నాయి. దీంతో జీవనోపాధి కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసి వెళ్లిపోతున్నారు. ఇలా వలసలు నివారించేందుకు వేతన దారులకు పనికి తగిన వేతనం అందేలాచేసి వారికి ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని అమలుచేస్తోంది. జానెడు పొట్ట కోసం మండుటెండలో శ్రమించే ఉపాధి కూలీలకు ప్రభుత్వం ధారోసా కల్పించింది. నిప్పులు చెరిగే ఎండల్లో పనిచేసే కూలీలకు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలనే ఉద్దశంతో వేతన జీవులకు ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తోంది. వేతన దారులకు కల్పిస్తున్న ప్రయోజనాలపై వారికి అవగాహన కాల్పించడానికి , దానితో పాటు పనులపై పర్యవేక్షణ ఉండేలా "రోజ్గార్ దివస్" పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.


జిలాల్లో గ్రామీణ ప్రాంతాల అధివృధికి , ప్రజల జీవనోపాధికి ఊతమిస్తున్న పథకం ఉపాధిహామీ పథకం. దీని ద్వారా వేలాది మంది జీవనోపాధి పొందుతారు. శ్రమజీవులు పనికి తగిన వేతనం నూతన విధివిధానాలతో ప్రయోజకరంగా మారింది. "రోజ్గార్ దివస్" కార్యక్రమం ద్వారా అధికారులు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను పర్యవేక్షించడంతో పాటు వారికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు , మౌలిక వసతులపై వేతనదారులు అవగాహన పొందేలా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. వేతన దారులు పనులకు హాజరై పనులు చేసిన , ఆ మేరకు తగిన వేతనం అందకపోగా అధికారులు చెప్పే గరిష్ట వేతనం మాటలకే పరిమితమయ్యేది. దీంతో చాలా మంది ఉపాధి పనులపై అనాసక్తి చూపుతూ వలస బాట పట్టేవారు.

ఈ క్రమంలో వేతన దారుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం "రోజ్గార్ దివస్" కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఉపాధిహామీ అధికారులు పని ప్రదేశానికి వెళ్లి ఏ మేరకు పనిచేస్తే పూర్తిస్థాయిలో నగదు వస్తుందో అవగాహన కల్పిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో నూతనంగా చేపట్టిన "రోజ్గార్ దివస్" కార్యక్రమాన్ని వారానికోసారి నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం అధికారులు, సిబ్బంది ఆయాగ్రామాల్లో పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కూలీలతో మమేకమవుతున్నారు. ఇచ్చిన కొలత ప్రకారం పనిచేసినట్లు అయితేనే గరిష్ట వేతనం పొందొచ్చని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: