జగన్ నిర్ణయాలు డేరింగ్ అండ్ డేషింగ్ గా  ఉంటున్నాయి. ఆయన నిర్ణయాలను టీడీపీ కూడా బయటకు అనకపోయినా మనసులో మెచ్చుకున్నవి కూడా ఉన్నాయి. అందులో ఫిరాయింపులను ఎంకరేజ్ చేయమని జగన్ చెప్పిన మాట నిజంగా టీడీపీకి ఇష్టమైన మాటే. ఇక వామపక్షాలు మెచ్చుకున్న నిర్ణయాలు కూడా చాలా  జగన్ తీసుకున్నారు. అన్ని పార్టీలను మెప్పించడం కేవలం నలభై రోజుల్లో సాధ్యం కాదు. కానీ జగన్ చేసి చూపించారు.


ఇదిలా ఉండగా ఏపిలో లాండ్ పూలింగ్ జీఓని రద్దు చేయడాన్ని బిజెపి స్వాగతించింది. ఆ పార్టీ మాజీఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ దీనిని సాహసోపేతమైన చర్య అని మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్‌ పూలింగ్‌ విధానం వల్ల విశాఖపట్నంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు.


ఈ విధానం వల్ల రైతులు నష్టపోయారని ఆయన చెప్పారు. కాని అక్రమాలు చేసేవారికి బాగా ఉపయోగం జరిగిందని అన్నారు. మొత్తానికి ఏపీలో అధికారం పట్టేద్దామని ఆపసోపాలు పడుతున్న కమలం పార్టీ నుంచి నిజాయతీగా జగన్ని అభినందించిన రాజు గారిని అంతా అభినందించక తప్పదు. జగన్ నిర్ణయాలు ఇపుడు అన్ని పార్టీలు హర్షించేలా ఉన్నాయనడానికి ఇదే ఓ పెద్ద ఉదాహరణ.


మరింత సమాచారం తెలుసుకోండి: