ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ట్విట్టర్ వేధికగా బూతులు తిట్టాడు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు ఇలా ఒకటి కాదు అతనికి చాలా పదువులు ఉన్నాయి అతనే నారా లోకేష్. ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ నోటికి అడ్డు అదుపు ఉండదు అనే విషయం అందరికి తెలుసు. 


కానీ మరి ఇంత నోరుజారుడు ఉంటుంది అని అసలు అనుకోలేదు నెటిజన్లు కూడా. మాజీ ఎంపీగా చేసిన ఆయనకు కొన్ని కోట్ల ప్రజలకు సేవలు చేస్తున్న ముఖ్యమంత్రిని ఎలా విమర్శించాలో కూడా తెలియడం లేదు. మీరు ప్రతిపక్ష నాయకుడు అయ్యుండచ్చు అంత మాత్రాన ఒక ముఖ్యమంత్రిని కంత్రి అని తిట్టే హక్కు మీకు లేదు. ముఖ్యమంత్రి హోదా ఉన్న వారికి గౌరవం ఇవ్వడం మంచిది అని నారా లోకేష్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 


ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య వ్యవసాయ రుణాల అంశం ఎలాంటి తీవ్ర చర్చ జరిగిందో అందరికి తెలుసు. ఈ సమావేశాలపై నారా లోకేష్ స్పందిస్తూ సీఎంపై ధ్వజమెత్తారు. సీఎంని ఆన్ పార్లమెంటరీ పదాలతో తిట్టారు. ట్విట్టర్ పిట్టా నారా లోకేష్ స్పందిస్తూ ''బురద జల్లి, నిరూపించు అనేసరికి సభ నుంచి పారిపోయే ఆకతాయి చేష్టలు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు చేశారంటే ఉడుకుమోతుతనం అనుకోవచ్చు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ కంత్రీ పనులేంటి @ysjagan గారూ! ఈ జన్మలో మీరు హుందాగా ప్రవర్తించలేరా? నిరూపించలేనప్పుడు సవాళ్ళు చేయడం దేనికి?'' అంటూ ప్రశ్నించారు. 


ప్రశ్నించారు సరే 'ప్రశ్నించడానికి ఒక పద్ధతి ఉంటుంది అది మరిచిపోతే ఎలా అని అని ప్రశ్నించారు. మీరు ఒక ముఖ్యమంత్రిని కంత్రి అనడం ఎంతవరుకు కరెక్ట్ అని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి పదాలు ఉపయోగించి జగనన్న అభిమానుల మనోభావాలు దెబ్బతియ్యకండి అని మరికొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ కంత్రి అనే పదానికి నారా లోకేష్ ట్విట్ డిలీట్ చేస్తారా ? లేక మాటను వెనుక్కు తీసుకుంటా అని ట్విట్ చేస్తారా అనేది చూడాలి... 



మరింత సమాచారం తెలుసుకోండి: