త్వరలో జరగనున్న స్థానికి సంస్థల ఎన్నికలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సిందిగా ఆయా నియోజక వర్గాల్లో మార్గ నిర్ధేశ్యం చేస్తోంది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే విజయానికి బావుటగా మారనున్నట్టు రాష్ట్ర పార్టీ నాయకులు మండల కేడర్‌కు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో జరిగిన మండల స్థాయి సమావేశానికి ఆ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి పిరియా సాయిరాజ్, రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు హాజరయ్యారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు కార్యకర్తలకు సూచించారు. పార్టీ విజయమే లక్ష్యంగా  ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని   పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సాయిరాజ్  పిలుపునిచ్చారు. ఈ కార్యాలయంలో మండల స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ  నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో అన్ని పంచాయితీలనువైసీపీ కైవసం చేసుకొనేందుకు కృషి చేయాలనీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి కార్యకర్త  సైనికుల్లా పనిచేయని, పార్టీకి విజయాన్ని కట్టబెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జయ ప్రకాష్ , పిఎం తిలక్ , పీ.నీలాచలం , శ్యామ్ పురియా , వైసీపీ మండల అధ్యక్షుడు కడియాల ప్రకాష్ , ఏ.మధు పాల్గొన్నారు.
మద్యపాన నిషేధంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఇచ్చాపురం సమన్వయ కర్త సాయిరాజ్ పేర్కొన్నారు. ఆ దశగా పనిచేస్తునామని తెలిపారు. బెజ్జిపుట్టుగా పంచాయితీ దుగనపుట్టుగలో బెల్ట్ షాప్లను మూయించడంతో పాటు ఆయా గ్రామస్తులు బుల్లిపుట్టుగలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిశేకం చేశారు. ఈ సందర్భంగా సాయిరాజ్ మాట్లాడుతూ వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలలో మద్యపాన నిషేధం ఒకటి  అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: