గత ఐదేళ్ళు ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏరోజు కూడా ప్రతిపక్ష పార్టీ ఐన వైసీపీ ఎమ్మెల్యేలకు నిధుల విషయంలో సహాయపడలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు చెందిన నియోజకవర్గాలకే నిధులు ఇచ్చాడు. వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా నియోజక వర్గం అభివృధ్ధి కోసమే అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీలోకి మారుతున్నామని అన్నారు. 
 
కానీ జగన్ మాత్రం చంద్రబాబు చేసిన తప్పు చేయట్లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతి నియోజకవర్గానికి కోటి రుపాయల నిధులు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. కులం, మతం, ప్రాంతం అనే తేడాను చూపమని అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలకు కూడా కోటి రుపాయల నిధులు ఇస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 
 
గడచిన ఐదేళ్ళలో చంద్రబాబు ఇలా నియోజక వర్గాల విషయంలో సమన్యాయం పాటించలేదు. సమన్యాయం పాటించి ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత దారుణమైన ఫలితాలు వచ్చి ఉండేవి కావు. ఇలా అన్ని నియోజక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వటం వలన ప్రజల్లోను, ప్రతిపక్ష పార్టీ చెందిన ఎమ్మెల్యేల్లోను జగన్మోహన్ రెడ్డిగారిపై మంచి అభిప్రాయం కలుగుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: