ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొత్తం బడ్జెట్ ను జూలై పన్నెండున ప్రవేశపెట్టనున్నారు. రాబోయే తొమ్మిది నెలల్లో వైఎస్సార్ ప్రభుత్వం చేసిన ప్రమాణాల ప్రకారం రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు అవ్వనుంది. వైఎస్సార్ ప్రభుత్వం ఇచ్చిన ప్రమాణాల ప్రకారం సంవత్సరానికి డెబ్బై ఐదు వేల మూడు వందల ఐదు కోట్లు అవుతుందనే అంచనా. గౌరవనీయులైన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆర్ధిక మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ గారికి మేనిఫెస్టొ లో ఉన్న నవరత్నాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యవసాయ రుణభారం లక్షా నలభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఉందని తాజా ఎస్ఎల్ బిసి మీటింగ్ ప్రకారం ఆయన అన్నారు. వైఎస్సార్ ప్రభుత్వం రైతులకు ప్రవేశ పెట్టిన పథకాల గురించి ఆయన మాట్లాడుతూ రైతులకు 0% వడ్డీ రుణాలు ఇవ్వాలని ఆయన ప్రస్తావించారు.

అదే విధంగా ఈ సంవత్సరం బ్యాంకు నుంచి ఎనభై నాలుగు వేల కోట్ల పంట రుణాలను రైతులకు అందించాలనే ఆయన అన్నారు. తీసుకున్న రుణాలు తగిన సమయంలో తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద వడ్డీ ఉండదని ఆయన అన్నారు. రైతులకు పగటి పూట అరవై శాతం పైగా ఉచితంగా కరెంటు ను సప్లై చేస్తామన్నారు వచ్చే సంవత్సరం జూన్ నాటికి మిగతా నలభై శాతం కరెంటు ను ఉచితంగా ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. దీనికి పదిహెడు వందలు కోట్లు అవుతుందని అధికారుల చెప్పగా దానిని వెంటనే విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు.

ఆక్వా రైతుల గురించి మాట్లాడుతూ 1.50 రూపాయలకే ఒక యూనిట్ కరెంట్ ను అందిస్తున్నామని ఆయన అన్నారు. దీనికి ఏడు వందల ఇరవై కోట్లు ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. అదే విధంగా రైతులకు వైయస్సార్ ప్రభుత్వమ్ అందించే పథకాలు గురించి మట్లాడుతూ వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం, దీనివల్ల యాభై ఐదు లక్షల రైతుల తరుపున కోటి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు రెండు వేల నూట అరవై నాలుగు కోట్ల బీమా ప్రీమియంను ప్రభుత్వం కడుతుందని ఆయన అన్నారు. శనగ రైతులకు క్వింటాకు పదిహేను వందలు రూపాయల చొప్పున పెంచుతూ మూడు వందల ముప్పై కోట్లు ఆయన విడుదల చేశారని చెప్పారు.

అదే విధంగా ఆయిల్ పామ్ రైతులకు ఎనభై కోట్లు విడుదల చేశారని ఆయన అన్నారు. దీని వల్ల లక్షా పది వేల మందికి లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. పొగాకు రైతుల గురించి మాట్లాడుతూ బోర్డు అధికారులతో మాట్లాడి లో గ్రేడ్ పొగాకు యొక్క రేటు పెంచి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని మంత్రి శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. పంట ధరల గురించి మాట్లాడుతూ అవసరమైన పంటలకు గిట్టుబాటు ధరలను దక్కేలా మార్కెట్ లో ఎమ్మెల్యేలనే మార్కెట్ చైర్మేన్ లుగా నిర్మిస్తూ నిర్ణయం తీసుకున్నారు.


గత సంవత్సరం విత్తన బకాయిల గురించి మాట్లాడుతూ, గత ప్రభుత్వం మూడు వందల ఎనభై నాలుగు కోట్లు రూపాయలు చెల్లించకుండా ఉంది అని, ఆ మూడు వందల ఎనభై నాలుగు కోట్ల బకాయిలను విడుదల చేయ్యడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. దాన్య సేకరణలో తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మా ప్రభుత్వం చెల్లించడానికి చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా మూడు వందల అరవై కోట్లు విడుదల చేసామని ఆయన సగర్వంగా అన్నారు.


గత సంవత్సరాని కి సంబంధించి ఏదైతే రెండు వేల కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిందో ఆ బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది అని ఆయన అన్నారు. వ్యవసాయదారులకు రోడ్ టాక్స్ రద్దు చేస్తామని కూడా అన్నారు. క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కలు గమనిస్తే పదిహేను వందల పదమూడు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని అన్నారు. అందులో కేవలం మూడు వందల తొంభై ఒక్క మందికి మాత్రమే కొంత సహాయం అందింది అని ఆయనన్నారు.దీనికి సంబంధించి రైతు భరోసా కింద ప్రమాదపు శాత్తు కాని లేదా ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఏడు లక్షల రూపాయల ఇవ్వాలనే చెప్పి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అన్నారు.


ఇప్పట్నుంచే కాకుండా గతంలో జరిగిన ఆత్మహత్యలకు గత ప్రభుత్వం ఎవరికైతే సహాయం అందించలేక పోయిందో వాళ్ళకు కూడా ఏడు లక్షల రూపాయలను అందించాలనే కలెక్టర్లకు ఆదేశించామని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం కోసం నెల రోజుల్లోనే మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇవి అని ఆయన అన్నారు. రాబోయే సంవత్సర కాలంలో రైతులకు తీసుకునే సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా తుఫాన్ వచ్చిన కరువు వచ్చినా పంట నష్టపోయిన రైతులకు ఖరీఫ్ లో నష్టమొస్తే రబీలోనే ఆ రైతన్నను ఆదుకునే దిశగా రెండు వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.


రాష్ట్రం లో ప్రతి రైతు కుటుంబానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈ అక్టోబర్ పదిహేనవ తారీకు నుంచి అందించబోతున్నామని ఆయన అన్నారు. మ్యానిఫెస్టో లో చెప్పిన దానికంటే ఏడు నెలలు ముందు నుంచే ఈ రబీ సీజన్ నుంచే అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రం లో డెబ్బై ఐదు లక్షలు రైతు కౌలు రైతు కుటుంబాలకు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అందించబోతున్నామని ఆయన అన్నారు. దాదాపు పదహారు లక్షల కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అందించబోతున్నామని ఆయన అన్నారు.


ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతు చేతులకందించడం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లోనే కాకుండా భారతదేశ చరిత్ర లోనే ఇది ఒక రికార్డు అని ఆయన సగర్వంగా చెప్పారు. ఈ నిధులను రైతుల పాత బకాయిలలో వేసుకోకుండా నిబంధనలను తీసుకొస్తున్నామన్నారు. మూత పడిన సహకార డైరీలు చెక్కెర ఫ్యాక్టరీలు అన్నింటినీ కూడా మొదటి ఏడాది లోనే పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: