గత ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 97 వేల కోట్ల నుండి 3 లక్షల 62 వేల కోట్లకు పెరిగాయి. ఈ పెరిగిన అప్పు భారం వలన ప్రస్తుత ప్రభుత్వమైన వైసీపీ ఇబ్బందుల్లో పడుతుంది. వచ్చే ఐదేళ్ళలో ఈ అప్పు భారాన్ని పెరగకుండా వీలైనంతగా తగ్గించుకోవాల్సిన అవసరం వైసీపీపై ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన నవరత్నాలకు నిధులు కేటాయించాల్సి ఉంది. 
 
నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలకు నిధులు చాలా అవసరం. గ్రామ వాలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు, అమ్మ ఒడి, వైయస్సార్ రైతు భరోసా, నాలుగు విడతల్లో డ్వాక్రా రుణమాఫీలాంటి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కువ మొత్తంలో అవసరం అవుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో మధ్యపాన నిషేధం అమలుకోసం ఇప్పటినుండే చర్యలు మొదలుపెట్టడంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిధులు పెరగడానికి కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధులు పెంచుకోవడం ద్వారా మాత్రమే పథకాల అమలు సక్రమంగా జరిపే అవకాశం ఉంటుంది. ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వంలో పెరిగిన అప్పుల వలన ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి సమస్యలు వస్తున్నాయి. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: