అప్పుచ్చువాడు వైద్యుడు..ఏదో కష్టాల్లో ఉంటే కానీ అప్పు జోలికి వెళ్లం, అలాంటిది అప్పు ఇచ్చి కాపాడేవాడిని వైద్యుడంత గొప్పోడని అంటుంటారు.  కానీ కొంత మంది అప్పు తీసుకున్న తర్వాత ఇచ్చిన వారికి చుక్కలు చూపించడం..నానా యాగీ చేయడం జరుతుగుంది. తాను 22 సంవత్సరాల క్రితం ఇండియాలోని ఓ చిరు వ్యాపారికి బకాయి పడ్డ రూ. 200ను తిరిగి ఇచ్చేందుకు ఇండియాకు వచ్చాడు కెన్యాకు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు. 

వివరాల్లోకి వెళితే..  1985 నుంచి 89 మధ్య కాలంలో మౌలానా ఆజాద్ కాలేజీలో మేనేజ్ మెంట్ విద్యను అభ్యసించానని, ఆ సమయంలో కాశీనాథ్ దుకాణంలో సరుకులు తీసుకునేదాన్నని టోంగీ వెల్లడించారు.  ఆ సమయంలో ఆయనకు చెల్లించాల్సిన రూ. 200 చెల్లించకుండానే కెన్యాకు తిరిగి వెళ్లిపోయానని, ఆపై తనకు వివాహమైందని, ఎప్పటికైనా ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిందేనని భావించానని ఆమె అన్నారు.

అయితే అత్యవసర పరిస్థితుల్లో తాను వెళ్లాల్సి వచ్చిందని..కానీ కాశీనాథ్ కి డబ్బు చెల్లించకపోవడంపై చాలా గిల్టీగా ఫీల్ అయ్యేదానినని ఆమె అన్నారు.  అయితే ఆయకు డబ్బు ఇవ్వాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఇంతకాలానికి తన భార్యతో కలిసి ఇండియాకు వచ్చానని, బకాయి పడ్డ డబ్బు ఇచ్చానని, తన మనసు ఎంతో ప్రశాంతంగా ఉందని తనను కలిసిన మీడియాకు టాంగీ వివరించారు. 

ఇది సామాన్యమై విషయమే అయినా నాకు మాత్రం జీవితాంతం గుర్తుండి పోయే ఓ భావోద్వేగపూరితమైన పర్యటనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. గావ్లీ, అతని బిడ్డలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆపై ఔరంగాబాద్ లో తాను చదివిన కాలేజీకి వెళ్లి, అక్కడి విద్యార్థులను కలిసి ముచ్చటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: