రైతులకు తీవ్రంగా అన్యాయంగా చేసిన చంద్రబాబు.. తాను చేసిన దానికి సిగ్గుతో తలవంచుకోవాలని జగన్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. సున్నా వడ్డీ అంశం విషయంలో తెలుగుదేశం వాదనను ఆయన తిప్పికొట్టారు. తెలుగు దేశం హయాంలో సున్నా వడ్డీ కింద ఎంత ఇవ్వాల్సి ఉంది.. ఎంత ఇచ్చారన్న లెక్కలు సభలో చెప్పి చంద్రబాబును ఇరుకునపెట్టారు.


ఐదేళ్లలో సున్నావడ్డీ పథకానికి రూ.11,595 కోట్లు ఇవ్వాల్సిఉంటే రూ.630 కోట్లు మాత్రమే చంద్రబాబు సర్కార్‌ చెల్లిందన్నారు జగన్. సున్నా వడ్డీ పథకం గొప్పగా అమలు చేసినట్లుగా..జాతీయ స్థాయిలో కూడా ఆయనను పొడిగినట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 2014–15 సంవత్సరంలో వ్యవసాయ రుణాలు రూ.29,658 కోట్లకు గాను చంద్రబాబు ఇచ్చిన వ్యవసాయ రుణాలు రూ.1186 కోట్లు మాత్రమేనని తెలిపారు.


వడ్డీ లేని రుణాలు ఇవ్వలేమని చంద్రబాబు సర్కార్‌ చేతులెత్తేసిందన్నారు. సున్నా వడ్డీ పథకానికి రూ.1186 కోట్లు కడితేనే రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తారని.. చంద్రబాబు ప్రభుత్వం రూ.43.31 కోట్లు మాత్రమే కట్టిందన్నారు. 2015–16 సంవత్సరానికి గాను ఏడాదికి 2,283 కోట్లు కట్టాల్సిన పరిస్థితుల్లో రైతులకు ఇచ్చింది రూ.31 కోట్లు మాత్రమే చంద్రబాబు సర్కార్‌ కట్టిందన్నారు.


ఈ లెక్కలన్నీ చెబుతూ.. లక్ష రూపాయలు ఇవ్వాల్సిన చోట దమ్మిడీ ఇవ్వలేదని.. అంటే.. కాదు.. నేను రెండు రూపాయలు ఇచ్చాను.. నువ్వు చెప్పింది తప్పు అంటున్న చంద్రబాబు, అతని పార్టీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: