మంచి ఉద్యోగం చేస్తూ డబ్బు ఆశతో ఎంతో మంది పేదలను ఇబ్బందులకు గురి చేస్తూ లంచం రూపంలో లక్షలు దోచుకున్న  రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వైపు అవినీతిరహిత ప్రభుత్వ అధికారులు తమ పాలనలో ఉన్నారని చెబుతున్న సీఎం కేసీఆర్ ఈ విషయంపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవినీతికి పాల్పపడినా చట్టం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లావణ్య వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది. తహశీల్దార్ లావణ్యను పోలీసులు అరెస్టు చేశారు. అంతే కాదు వీఆర్వో అనంతయ్యతో పాటు తహశీల్దార్ లావణ్యకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులిద్దరినీ పోలీసులు చంచల్‌గూడా జైలుకు తరలించారు. లావణ్యను పోలీసులు అరెస్టు చేశారుఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తేలడం వల్ల లావణ్యను నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో విచారించారు.

విచారణ తర్వాత ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. లావణ్య ఓ స్థిరాస్తి సంస్థకు అనుకూలంగా వ్యవహరిచేందుకు నిబంధనలు మార్చి ఆమె రూ. 30 లక్షలు డిమాండ్‌ చేశారు. అయితే ఆ సంస్థ 30 లక్షలను ఆమెకు ముట్టజెప్పినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా ఆమె పై మరో కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఆమె బెస్ట్ తహశీల్దార్ అవార్డు కూడా పొందారు.  అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడం వల్ల, జూన్ నెలలో పదిమంది వీఆర్వోలు బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన వీఆర్వోలు విధుల్లో చేరినా.. తహశీల్దార్ మాత్రం పాతవారిని మాత్రం వేరే చోటికి పంపలేదు. కాగా, బదిలీ అయిన వారిలో వీఆర్వో అనంతయ్య కూడా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: