నేడు ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మద్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు నడుస్తున్నాయి.  ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకింత సీరియస్ అయ్యారు.  అధికారపక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో  విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంతో సభలో గందరగో చెలరేగింది.  సభలో టీడీపీ సభ్యులు అధికార పక్ష నాయకులు మాట్లాడుతున్న సమయంలో గట్టిగా లొల్లిచేయడం..నిన్న జరిగిన విషయంపై పదే పదే ప్రస్తావించడంపై  స్పీకర్ తమ్మినేని సీతారాం వారిపై సీరియస్ అయ్యారు. 

శుక్రవారం నాడు వడ్డీ రాయితీ లేని అప్పుల విషయమై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.  సభలో ముఖ్యమంత్రి కానీ, విపక్ష నేతలు కానీ ఎవరైనా మాట్లాడే సమయంలో గందరగోళం చేయొద్దని..సభలో జరుగుతున్నది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని..వారి ముందు సభ్యతగా ఉండాలని హెచ్చరించారు.

సభలో తాను సీనియర్‌నని సభను హుందాగా నడుపుతన్నట్టుగా చెప్పారు. సభ నిర్వహణలో ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదన్నారు.  హుందాగా సభను నడిపించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.  ఆయన మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ సభ్యులు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని గొడవ చేశారు..దాంతో స్పీకర్ తమ్మినేని  ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదన్నారు. సభ్యుల ప్రవర్తనను ప్రజలు చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: