ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న సుజనా చౌదరి చంద్రబాబు రాష్ర్టంలో లేని సమయంలో టీడీపీని కేంద్రంలోని బీజేపీలో విలీనం చేయ్యాలని లేఖ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. లేఖ ఇవ్వటమే కాకుండా సుజనాతో పాటు మరో ముగ్గురు కూడా బీజేపీలో చెేరారు. కొందరు చంద్రబాబు చెప్పడం వల్లే చేరానని, మరికొందరి చంద్రబాబును అసలు మాట్లాడాకుండానే భారతీయ జనతా పార్టీలోకి మారారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు సుజనా చౌదరి మరో కీలక ఘట్టానికి తెర లేపనున్నారు.

గతంలో టీడీపీతో పోత్తు పెట్టుకోని ఏపీలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. తాజా జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏవరి వారు పోటీ చేయడంతో అధికారం వైసీపీని వరించింది. కనీసం ఏపీలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన పార్టీ కేంద్రంలో మాత్రం పాగా వేసింది. ఇక ఏపీలోని నేతలపై బీజేపీ దృష్టి సారించింది. నేతల బలహీనతలను గుర్తించి మైండ్‌గేమ్‌ ద్వారా వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషించి ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సంప్రదింపులు జరిపిన సుజనాతో సాన్నిహిత్యం మూలంగానే బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ టీడీపీకి, శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గురువారం ఆయన ఢిల్లీలో సుజనా చౌదరి, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌ను కలిసి తన చేరికకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. త్వరలో మంచి ముహూర్తం చూసుకుని బీజేపీ తీర్ధం తీసుకోనున్నారు.

2014 ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వగా పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ సామాజిక అంశం ఆధారంగా చంద్రబాబునాయుడు అన్నం సతీష్‌కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు కూడా అప్పగించి ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు ఎమ్మెల్సీ పదవిలో మరో రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ తిరిగి 2019 ఎన్నికల్లో బాపట్ల సీటు కేటాయించి తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించారు. సుజనాచౌదరితో తనకున్న సాన్నిహిత్యంతో బీజేపీలో చేరటాన్ని తప్పుపట్టనప్పటికీ తెలుగుదేశంపైనా, పార్టీ అధినేత తనయుడిపైనా విమర్శలు చేయటంపై మాత్రం తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.

ఇక సుజనాచౌదరితో సంబంధాలు ఉన్న మరికొందరు నేతలు కూడా బీజేపీ వైపు దృష్టి సారించారు. టీడీపీలో రాష్ట్ర స్థాయిలో కీలక పదవిని నిర్వర్తించి ఆ తరువాత చంద్రబాబు ఆశీస్సులతో ప్రభుత్వ పరమైన పదవి కూడా పొందిన మరో నేత కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిన్నమొన్నటి వరకు బీజేపీలో చేరికలపై ఆంక్షలు పెట్టిన రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన గళం మార్చి అభిమానంతో వస్తే పార్టీలోకి ఎవరినైనా ఆహ్వానిస్తామంటూ పూర్తిగా ద్వారాలు తెరిచేశారు. ప్రధానంగా టీడీపీపైనే బీజేపీ దృష్టి పెట్టింది. టీడీపీ ఓటమి చెందినప్పటికీ నేటికీ గ్రామస్థాయిలో సైతం పటిష్టమైన కేడర్‌ ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు రాష్ర్టంలో వైసీపీ ప్రయత్నిస్తుంటే... కేంద్రంలో బీజేపీ సుజనా రూపంలో కొత్త దారులకు తెర లేపింది. చూద్దాం చివరకు ఏమీ జరుగుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: