జాతిపిత మ‌హాత్మా గాంధీ ప్ర‌వ‌చించిన గ్రామ స్వ‌రాజ్యం- అనే మాట‌ల‌ను రాజ‌కీయ నేతాలు త‌ర‌చుగా చెబుతూనే ఉంటా రు. గ్రామాలు స‌శ్య‌శ్యామలంగా ఉంటేనే రాష్ట్రాలు, త‌ద్వారా దేశం బాగుంటుంద‌ని ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడు చెప్పేదే. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు ఏ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. గ్రామీణుల‌పై క‌న్నీరు కారుస్తూనే ఉంటారు. వారికి ఎంతో చేయాల‌ని, తాము చేస్తామ‌ని చెబుతూనే ఉంటారు. అయితే, చేసిన వారు మాత్రం చాలా త‌క్కువ‌. ఒక్క గుజరాత్ మిన‌హా దేశంలో ఎక్క‌డా గ్రామ స్వ‌రాజ్యానికి పెద్ద‌గా నిధులు కేటాయించిన ప‌రిస్తితి లేకుండా పోయింది. 


ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వం కూడా గ్రామీణుల‌పై ప్రేమ ఒల‌క బోస్తున్నా.. వారికి స‌రైన విధంగా బ‌డ్జెట్ కేటాయింపులు మాత్రం చేయ‌డం లేదు. అయితే, ఏపీలో కొలువు దీరిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం త‌న తొలి అడుగులోనే గ్రామ స్వ‌రాజ్యం దిశ‌గా అడుగులు వేసిం ది. వాస్త‌వానికి జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణం చేసిన కార్య‌క్ర‌మంలోనే ఆయ‌న గ్రామాల‌కు ఇస్తున్న‌, ఇచ్చే ప్రాధాన్యాన్ని సోదా హ‌ర‌ణంగా వివ‌రించారు. గ్రామ వలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి, ప్ర‌జ‌ల జీవన స్థితి గ‌తుల‌ను పెంచుతామ‌ని ఆయ‌న చెప్పారు. 


ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన 2019-20 తొలి వార్షిక‌ బ‌డ్జెట్‌లోనూ గ్రామా భ్యుద‌యానికి జ‌గ‌న్ పెద్ద‌పీట వేశారు.  గ్రామీణాభివృద్ధికి రూ.29,329.98కోట్లు కేటాయించారు. నిజానికి ఇంత పెద్ద మొత్తంగా బ‌డ్జెట్ కేటాయింపులు చేయ‌డం ఇదే తొలిసారి. రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో రాష్ట్ర రైతాంగానికి పెద్ద‌పీట వేసింది. వారికి అన్ని రూపాల్లోనూ సాయం చేసేందుకు  రూ.20,677.08కోట్లు కేటాయించింది. దీనిక‌న్నా ఎక్కువ‌గా గ్రామీణ అభివృద్దికి మ‌రో 9 కోట్ల‌ను అద‌నంగా చేసి భారీ ప‌ద్దునే ప్ర‌క‌టించింది. 


త‌ద్వారా గ్రామీణ ఉపాధి, ఆదాయం పెంపుతో వ‌ల‌స‌ల‌ను నిరోధించ‌డం, గ్రామీణుల్లో చైతన్యం తీసుకురావ‌డం, వారిలో అక్ష‌రాస్య‌త పెంపు, సాగును మ‌రింత ప్రోత్స‌హించ‌డం, చేతివృత్తుల‌ను మ‌రింత అభివృద్ధి దిశ‌గా తీసుకు వెళ్ల‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కు పెద్ద‌పీట వేసింది. మొత్తంగా చూస్తే.. ఇది గ్రామ స్వ‌రాజ్యానికి జ‌గ‌న్ ఇచ్చిన తొలి ప్రాధాన్య‌మ‌నే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: