బీజేపీలో సీనియర్లకు, పాతవారికి అసలు ప్రాధాన్యత లేదని అంతా కలవరపడుతున్నారు. ఫిరాయింపుల వెంట పార్టీ పడుతోందని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఏ మాత్రం అవకాశాలు ఇవ్వడంలేదని ఆవేదన చెందుతున్నారు. దాంతో బీజేపీ వ్యూహం మార్చింది.



ఈ నేపధ్యంలో  బీజేపీ పాతకాపులకు కాపు కాస్తోంది. మరో ఎపి బిజెపి నేతకు పదవి లభించింది. ఎ బీజేపీఅదికార ప్రతినిది యడ్లపాటి రఘునాధబాబును పోగాకు బోర్డు చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో ఉన్నారు. గుంటూరులో ఈ బోర్డు కార్యాలయం ఉంటుంది. 


ఇక ఇప్పటికే  ఎపి బిజెపి నేతలు కొందరు కేంద్రంలో పదవులు పొందగలిగారు. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఎయిర్ ఇండియా డైరెక్టర్ గా పదవి లో నియమితులు కాగా, విష్ణువర్దన్ రెడ్డిని నెహ్రూ యువక కంద్ర ఉపాద్యక్షుడిగా నియమితులయ్యారు. తాజాగా యడ్లపాటి రఘునాద బాబు టొబాకో బోర్డు చైర్మన్ పదవి పొందారు. 


ఆయన బిజెపిలో సుదీర్ఘకాలంగా ఉంటున్నారు.ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సన్నిహితుడుగా గుర్తింపు పొందారు. మొత్తానికి పాతవారికి కొంత అధికార వాసన చూపిస్తే ఇంకా ఎక్కువగా ఇతర పార్టీలు ఆకర్షితులవుతారన్నది బీజీపీ ఎత్తుగడ కావచ్చేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: