ఏపీ బడ్జెట్ ప్రసంగం పూర్తికాగానే.. మాజీ మంత్రి నారా లోకేశ్ యథావిదిగా తన ట్విట్టర్ ఎకౌంట్ కు పనిచెప్పారు. అంశాలవారీగా వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విమర్శల వర్షం కురిపించారు. అన్ని రంగాలకూ నామామాత్రపు కేటాయింపులు జరిపిన జగన్ ను చూస్తుంటే నామమాత్రపు ముఖ్యమంత్రిలా కనిపిస్తున్నారని కామెంట్ చేశారు.


ఇంకా ఏమన్నారంటే... “ బడ్జెట్ లో జగన్ కేటాయింపులే నామమాత్రమా?.. మీ హామీలు కూడా నామమాత్రమా? చూస్తుంటే మీరు నామమాత్ర ముఖ్యమంత్రిలా అనిపిస్తున్నారు. రైతుల వడ్డీలేని రుణాలకు రూ.3,500 కోట్లు ఎందుకు కేటాయించలేదు. ఇదేనా మీ చిత్తశుద్ధి?


“ రైతుల వడ్డీలేని రుణాల కోసం రూ.3,500 కోట్లు ఇస్తామన్నారు. సొంత జిల్లాలో తమ తండ్రిగారి పేరున రైతు దినోత్సవం జరుపుతూ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అసలేమీ ఇవ్వలేదని ఒకరోజు, ఇంతే ఇచ్చిందని ఒకరోజు అన్నారు. తీరా బడ్జెట్ లో నామమాత్రంగా రూ.100 కోట్లు కేటాయించారు.”


" పథకాలకు మీ పేర్లు తగిలించుకుని మురిసిపోతున్నారు సరే... అమ్మఒడిలో లబ్దిపొందే తల్లుల సంఖ్యను సగానికి తగ్గించడం ఏంటి? ఒక తల్లికి ఇచ్చి, ఇంకో తల్లికి ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ, జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? పథకానికి కూడా 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెడితే బాగుండేది.


" ఆర్థికమంత్రిగారు రామాయణమంతా చదివారు.. సంజీవని గురించి చెప్పారు. వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే ప్రభుత్వమే చూసుకుంటుందని ఊదరకొట్టారు... చివరికి ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు విదిల్చారు. కొండంత రాగం తీసి పాట పాడకుండా కునుకేసినట్టుంది.” "ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళు కడతామన్నారు... పైగా గృహరుణాలన్నీ రద్దు చేస్తామన్నారు. బడ్జెట్ చూస్తే గృహ నిర్మాణానికి కేవలం రూ.8,615 కోట్లు ఇచ్చారు. జగన్ నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్ళు కాదుకదా.”


మరింత సమాచారం తెలుసుకోండి: