రాయచోటి పట్టణ శివారులోని ఎపి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఫూడ్ పాయిజన్ తో 50 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వారందరినీ స్థానికి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. రెండవ శనివారం శెలవుదినం కావటంతో విద్యార్థులంతా హాస్టల్‌లోనే ఉన్నారు. వారికి ఏర్పాటు చేసిన మధ్యాహ్నం బోజనం విషాహారంగా మారడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 


ఒక్కసారిగా అందరూ వాంతులు విరోచనాలు చేసుకోవటంతో హాస్టల్‌ సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను స్థానికుల సహాయంతో సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఫూడ్ పాయిజన్ జరిగినట్టు చెబుతున్నారు. కాగా మధ్యాహ్న బోజనంలో ఎటువంటి తేడా లేదని హాస్టల్‌ సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా స్వల్పంగా కోలుకున్న విధ్యార్థులు మాత్రం తాము ఉదయం తిన్న ఇడ్లీ, చట్నీ లో అధికంగా కారం ఉన్నట్టు చెబుతున్నారు.

అంతేకాకుండా మజ్జిగలో ఎక్కువగా బ్లీచింగ్ కలిపినట్టు వెల్లడించారు. ఆ ప్రాంత ఆశావర్కర్లు మాత్రం అందుకు బిన్నంగా  చెబుతున్నారు. మూడు రోజుల క్రితం నీటి ట్యాంకర్లలో మూడు బల్లులు వున్నా పట్టించుకోలేదంటున్నని వారు వెల్లడించారు. సంఘటనపై సమాచారం తెలుసుకున్న  ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కారణాలపై ఆరా తీస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా  వైద్యులకు సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: