విద్యుత్ శాఖలో ఇటీవల నిర్వహించిన సాధారణ బదిలీల్లో పైరవీలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కోరిన చోట్లకు బదిలీలు చేసారని పలువురు విద్యుత్ శాఖాధికారులు వాపోతున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సర్కారులో సాధారణ బదిలీల కింద వివిధ కేడర్ లకు చెందిన సుమారు 120 మందిని బదిలీలు చేశారు. ఇందులో అగ్రభాగం ఆయా యూనియన్ నాయకులు చెప్పిన వారికే బదిలీల్లో అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలను అధికారులు నిర్వహించారని విమర్శలు ఉన్నాయి. శ్రీకాకుళం సబ్ డివిజన్ లో ముగ్గురు లైన్ ఇన్స్పెక్టర్లు , ఇద్దరు స్వీపర్లకు బదిలీ నిర్వహించారు. 

ఇందులో పలువురిని డివిజన్ దాటి బదిలీలు చేశారు. సబ్ ఇంజినీర్ కేడర్ లో ఐదేళ్లు దాటితే డివిజన్ లేదా అవుట్ అఫ్ డివిజన్ కు బదిలీ చేయాల్సి ఉంది . కానీ ఈ నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలు డివిజన్ పరిధిలో కాకుండా వేరే డివిజన్ లకు బదిలీలు చేయడంతో వారంతా అన్యాయానికి గురయ్యారని వాపోతున్నారు. ఒకే కేడర్ లో ఐదేళ్లు కొనసాగిన ఉద్యోగులను బదిలీ  చేయాల్సింది పోయి.. వారిని ఒకే చోట కొనసాగించమంటూ..పదోన్నత ఇవ్వడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నించారు. సొమ్ము చేతులు మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బదిలీలకు ముందు ఖాళీలను చూపించక పోవడంతో కౌన్సెలింగ్లో సీనియారిటి ప్రాతిపదికన ఉద్యోగులు ఎంచుకోవడానికి కుదరలేదు. కౌన్సిలింగ్ లో ఇదే విషయాన్నీ పాటించక పోవడంతో బదిలీలు వ్యవహారం పక్కత్రోవ పట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ కార్పోరేట్ కార్యాలయం (సిజిఎం) పివి సత్యనారాయణ , రామకృష్ణ కేడార్ అధికారులుగా విచ్చేసి పరిక్షించారు. ఎట్టకేలకు ఖరారైన జాబితలను ఎస్పీ కార్యాలయం నోటీసు బోర్డులో పెట్టారు. లైన్ మేన్ , లైన్ ఇన్స్పెక్టర్ లు ఇతర సిబ్బంది బదిలీలు శ్రీకాకుళం , పాలకొండ , టెక్కలి డీఎల్ కె.చలపతిరావు, సాంబశివరావు , గిరీశ్వరావులు నిర్వహించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: