జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. లావేరు , రణస్థలం , జి.సిగడాం మండలాలపై ప్రత్యేక ద్రుష్టి సాదించాలన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని "జలశక్తి అభియాన్" కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతివారం ప్రగతిని నివేదించాలన్నారు. వర్షపు నీటిని కూడా సంరక్షించాలని , ఇంటి పైకప్పు నుంచి వచ్చే నీటిని భూమిలో ఇంకేల చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ జలాల పెంపునకు ప్రతి అంశాన్నికూడా పరిశీలించాలన్నారు. 

పరిగెత్తే నీటికి నడక నేర్పాలని , నడిచే నీటిని ఆపాలన్నారు. గ్రామంలో యువజన సంఘాలు, స్వయం సహాయక సంఘాల సేవలను వినియోగించుకుని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలన్నారు. మూడు మండలాల్లో పంటలకు సంబంధించి మార్పులు తీసుకురావాలని , ఇందుకు రైతుల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చేందుకు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎక్కువ నీటిని వినియోగిస్తే ఇబ్బందులు తప్పవని సూచించారు. జల సంరక్షణ పై ఈ నెల 15 న పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించాలని కలెక్టర్ జె.నివాస్  ఆదేశాలు జారీ చేశారు. 

జల సంరక్షణపై ప్రతి ఒక్కరిలో చైతన్యం నింపలసిన అవసరం ఉందన్నారు. అంతకముందు డ్వామా పిడి హనుమంత కూర్మారావు "జల శక్తి అభియాన్" కింద చేపట్టాల్సిన పనులకు సంబంధించి డిఎల్ఆర్ సిలో వివిధ శాఖలకు చెందిన క్షేత్ర  స్థాయి సిబ్బందితో   సమావేశం నిర్వహించారు. డిఆర్ డిఓ పిడి ఏ.కల్యాణ చక్రవర్తి , వ్యవసాయ శాఖ జెడి ఏ.ఈశ్వర రావు , భూగర్భ జల వనరుల శాఖ సహాయ సంచాలకులు ఎస్. లక్ష్మణ రావు తదితరులు పాల్గొని కార్యాక్రమాన్ని పూర్తిచేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: