ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి తెలుగుదేశం పార్టీ ఓట‌మి పాల‌యిన సంగ‌తి తెలిసిందే. అధికార మార్పిడి అనంత‌రం ఆయా పార్టీల మ‌ధ్య జోరుగానే విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా, వైఎస్ జ‌గ‌న్ సార‌థ్యంలోని ప్ర‌భుత్వంపై టీడీపీ యువ‌నేత నారా లోకేష్ హాట్ కామెంట్లు చేశారు. వాలంటీర్ల ఇంటర్వ్యూలపై తనదైన శైలిలో ట్విట్టర్లో స్పందించిన లోకేష్ వాలంటీర్ పోస్టుల పేరుతో యువతను మోసం చేస్తున్నారని.. పోస్టులను వైసీపీ నేతలు ఇప్పటికే అమ్మేసుకుని ఇప్పుడు ఉత్తుత్తి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. దీనికి వైసీపీ ఎంపీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ఊహించ‌ని కౌంట‌ర్ ఇచ్చారు.



గ్రామ వాలంటీర్ల ఇంట‌ర్వ్యూల‌పై లోకేష్ విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలుగు సినిమాలలో ఉత్తుత్తి బ్యాంకులు, జగన్ నిర్మించిన ఉత్తుత్తి సంస్థల మాదిరిగానే ప్రస్తుతం వాలంటర్లకు ఉత్తుత్తి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి నారా లోకేష్. వాలంటీర్ల ఇంటర్వ్యూలపై తనదైన శైలిలో ట్విట్టర్లో స్పందించిన లోకేష్ వాలంటీర్ పోస్టుల పేరుతో యువతను మోసం చేస్తున్నారని.. పోస్టులను వైసీపీ నేతలు ఇప్పటికే అమ్మేసుకుని ఇప్పుడు ఉత్తుత్తి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థకు స్వచ్ఛంద దోపిడీ అని పేరుపెట్టాల్సిందన్నారు.


దీనిని విజ‌య‌సాయిరెడ్డి తిప్పికొట్టారు. ``ప్ర‌జలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీది. గ్రామ వలంటీర్ల ఇంటర్వ్యూలపై అభాండాలు వేస్తున్నావు. కావాలంటే దరఖాస్తు పెట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లిరా.``అంటూ పంచ్ వేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: