వ్యాపారం ఎపుడూ వ్యాపారమే. అందులో పాలిటిక్స్ ఎపుడూ టార్గెట్ చేరేందుకేనన్నది తెలిసిందే. తెలుగునాట రాజకీయాలను గమనిస్తే గత రెండున్నర దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్యనే కేంద్రీక్రుతమైపోయాయి. అటు బైఎస్, ఇటు బాబు, ఇలా సమరమే.


ఈ నేపధ్యంలో ఒకరు అధికారంలోకి వస్తే రెండవవారికి గిట్టదు. వారి పధకాలు అటకెక్కిస్తారు. ఇపుడు ఏపీలో అలాటిదే జరుగుతోంది.  జగన్ పవర్లోకి వచ్చారు. బాబు ప్రాజెక్టులకు అసలు విలువ ఇవ్వడంలేదు. అందులో  అగ్ర తాంబూలం కియా అంటున్నారు. కియా ప్రాజెక్ట్ అనంతపురంలో వచ్చినా  కియా అనుబంధ పరిశ్రమలు తరలి  వచ్చేందుకు భూమి విలువను రూ.6 లక్షలుగా  నాటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందట.


దీనిని జగన్ ప్రభుత్వం రూ.60 లక్షలకు పెంచింది. దీంతో అనుబంధ పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఈ నిర్ణయం వల్ల కియా నిర్వహణ ఖర్చు కూడా పెరిగిపోవడం, చంద్రబాబుకు క్రెడిట్ రావడానికి మేము ఎందుకు సహకరించాలని జగన్ మొండిపట్టు పట్టడంతో కియా సీఈవోకు ఒక ఐడియా వచ్చింది. అదే వైఎస్ఆర్ ఐడియా అంటున్నారు.


ప్రస్తుత పాలకులను బుట్టలో వేసుకోవడానికే వైఎస్సార్ హ్యాపీగా  పేరు వాడేశారని అంటున్నారు. ఆ కారణంగా క్రెడిట్ తన తండ్రికి ఇస్తే కియాకు జగన్ తప్పకుండా సహకరిస్తారన్న ఎత్తుగడ కియాది బాగానే పారింది. అయితే ఇక్కడ బలి అయిపోయింది మాత్రం చంద్రబాబే. ఆయన పొలిటికల్ కెరీర్లో చెప్పుకోవడానికి ఏమీ లేకుండా కియా కంపెనీ పెద్దలు చేసేసి సున్నా చుట్టేశారు. దటీజ్ బిజినెస్ పాలిటిక్స్.
 



మరింత సమాచారం తెలుసుకోండి: