చివరకు అసెంబ్లీలో సహచర సభ్యుడు బుచ్చయ్య చౌదరి సీటును మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కబ్జా చేసేశారు. సీటు కబ్జా విషయంలో అసెంబ్లీలో బుధవారం పెద్ద రబసే జరిగింది. కబ్జా పర్వంలో చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవటంతో వివాదం మరింత పెరిగిపోయింది. చివరకు స్పీకర్ జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది.

 

 ఇంతకీ విషయం ఏమిటంటే అసెంబ్లీలో ఎవరు ఎక్కడ కూర్చోవాలన్న విషయాన్ని స్పీకర్ నిర్ణయిస్తారు. సీరియారిటి, లేకపోతే పేర్లలో అక్షర క్రమాన్ని బట్టి సీట్ల కేటాయింపుంటుంది. అలాగే టిడిపికి సంబంధించి చంద్రబాబు పక్కన సీనియర్ సభ్యుడు బుచ్చయ్యచౌదరిని కేటాయించారు. అయితే బుచ్చయ్యను వెనక్కుపంపేసి ఆ సీటును అచ్చెన్న ఆక్రమించారు.

 

ఎన్నికలైన దగ్గర నుండి కూడా చంద్రబాబు సీనియర్ సభ్యుడు బుచ్చయ్యను కాదని అచ్చెన్నకే బాగా ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందుకనే బుచ్చయ్య సీటును అచ్చెన్న కబ్జా చేశారు. ఈ వివాదం మొదలవ్వగానే చంద్రబాబు జోక్యం చేసుకుని తన పక్కనే అచ్చెన్న కూర్చోవాలని పట్టుబట్టారు.

 

దాంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయించామని చెప్పారు. నిబంధనలను పక్కనపెట్టాలని అనుకుంటే ముందుగా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలని సూచించినా చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదు. దాంతో వివాదం పెద్దదైపోయింది. చివరకు స్పీకర్ జోక్యం చేసుకుని సీటు మార్పిడి విషయాన్ని పరిశీలిస్తానని చెప్పటంతో వివాదం ముగిసింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: