ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేసే చక్కటి అవకాశం... ఆ సేవలకు ప్రతి ఫలంగా జీతం కూడా అందుతుంది. స్థానిక యువతను ఇది బాగా ఆకట్టుకుంది . ప్రభుత్వం ప్రకటించిన వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఎక్కువ మంది కీలకమైన మౌఖిక పరీక్షకు హాజరు కాలేదు. వారు రాకపోవటానికి కారణాలు ఏమైనా ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. గ్రామాల్లో  ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీరును నియమించాలన్నది లక్ష్యం. గిరిజన ప్రాంతాల్లో 30 ఇళ్లుకు ఒకరిని నియమించేలా కరసత్తులు చేశారు.  ఈ మేరకు సర్వే నిర్వహించి ఎందరు అవసరమో నిర్ణయించారు. నిరుద్యోగులకు , సేవాభావంతో ముందుకు సాగే వారికి ఇదో మంచి అవకాశం  కావటంతో జిల్లా వ్యాప్తంగా భారీగా దరఖాస్తులొచ్చాయి. 

ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేసేందుకు.. గ్రామాలు , పట్టణాలలోను వాలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం సరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 23వ తేదీ వరకు మౌఖిక పరీక్షలు కొనసాగనున్నాయి. మండలం యూనిట్ గా రిజర్వేషన్లు అమలు చేయాలనీ నిర్ణయించారు. మొత్తం పోస్టుల్లో సగం మహిళలకు దక్కనున్నాయని అధికారులు అన్నారు.

 ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఎలాంటి రుసుము లేకున్నానే ప్రభుత్వం దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్లి.. నిర్వాహకులకు కొంత చెల్లించి వీరంతా దరఖాస్తులు చేసుకున్నారు. అయినా చాలా మంది  పరీక్షలకు హాజరుకాలేకపోయారు. అధికారులకు అందిన సమాచారం  మేరకు 37.25 శాతం మంది మాత్రమే  మౌఖిక పరీక్షలకు హాజరయ్యారు. 62.75 మంది గైహాజరయ్యారు. ఇప్పటి వరకు 77,505 మంది హాజరు కావాల్సి ఉండగా , 28,714 మంది మాత్రమే హాజరయ్యారని అధికారులు తెలియచేసారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: