ఈ ఏడాది 15,215 ఎకరాల్లో మొక్కల పెంపకానికి లక్ష్యంగా చేసుకున్నామని ,  దీనికి సంబందించిన ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మారావు వెల్లడించారు. నగరంలోని జిల్లా రిసోర్స్ కేంద్రంలో సహాయ పథకం సంచాలకులు , ఈసీలతో  ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వర్షాల సీజన్ వచ్చినందున ఈ సీజన్  మొక్కలు పెంచేందుకు అనువుగా ఉంటుందని తెలియజేసారు. మండల స్థాయిలో సిబ్బంది ప్లేంటేషన్ పనులు లబ్ధిదారులకు సంబంధించిన 7239 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. వీటిలో 420 మంది లబ్దిదారులకు చెందిన 291.40 ఎకరాల విస్తీర్ణం లో మొక్కలు నాటేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. 3875 మంది రైతులకు  చెందిన 3192  ఎకరాల్లో మొక్కలు నాటేందుకు అనుమతులు జారీచేశామన్నారు. 

ప్రధానంగా తిత్లీ తుఫాను ప్రధావంతో దెబ్బతిన్న ఉద్దానం రైతాంగాన్ని ఆదుకునేందుకు జీడిమామిడి, మామిడి , కొబ్బరి చెట్లు నాటేందుకు దృష్టి సాధించామని సూచించారు. ఈ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు పెంపేకం చేయాలి , చెరువు గట్లు , కాలువ గట్లపై పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని డ్వామా పీటీ అధికారులను కోరారు.

దీనికి అవసరమైన మొక్కల కడియం, తదితర ప్రాంతాల నర్సరీల నుంచి సరఫరా చేయాలి సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ భూములు, పాఠశాలలు, కళాశాలలు ఆవరణంలో మొక్కలు పెంపకం తప్పనిసరని ఆయన సూచించారు.సాకేతిక సమస్యల సాకులతో పనుల్లో జాప్యం చేస్తే క్షమించేది లేదని చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: