ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గురించే రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరిగింది.  పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎలాంటి సభలు పెడుతున్నారు.  ఎక్కడ పర్యటిస్తున్నారు.  పర్యటనల వివరాలతో పటు పవన్ గురించి సోషల్ మీడియా మొత్తం నిండిపోయి ఉండేది.  ఎన్నికల తరువాత స్వరూపం పూర్తిగా మారిపోయింది.  


వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు.  జనసేన పార్టీ కేవలం ఒక్కసీటు మాత్రమే గెలుచుకోగలిగింది.  అంటే పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ సైతం ఓడిపోవడం విశేషం.  సినిమా గ్లామర్ వేరు.. రాజీకీయం వేరని పవన్ కు అర్హ్డం అయ్యింది.  పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి వెళ్తారని వార్తలు వచ్చాయి.  


వీటిని పవన్ పెద్దగా పట్టించుకోలేదు.  ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమాల్లోకి వెళ్ళేది లేదని, చివరి శ్వాస వరకు ప్రజల మధ్యలోనే ఉంటానని అన్నారు.  ఇటీవలే తానా సభలకు వెళ్లిన పవన్.. ఆ తరువాత మీడియాతో పెద్దగా టచ్ లో ఉండటం లేదు.  పవన్ జనసేన పార్టీ ఇప్పుడు ఏం చేస్తున్నదో తెలియని పరిస్థితి.  


పవన్ కళ్యాణ్ సీక్రెట్ గా పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారని, మాస్టర్ ప్లాన్ తో త్వరలోనే రంగంలోకి దిగుతారని, కొత్త ప్రభుత్వం కాబట్టి కొన్ని రోజులు వేచి చూడాలని పవన్ అంటున్నారు.  ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా మెచ్చుకుంటామని పవన్ చెప్పడం విశేషం.  జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అలానే ఉన్నాయి.  అలాటప్పుడు పవన్ కళ్యాణ్ ఏపి ముఖ్యమంత్రి జగన్ పై ఎలాంటి ఆరోపణలు చేస్తారు చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: