ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయలు తీసుకుంటున్నారు. సంచలన నిర్ణయానికి మరో పేరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే విధంగా అయన నిర్ణయాలు ఉంటున్నాయి. పేద, ధనిక, కులం, మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అయన అమలు చేసే పథకాలు అందేలా అయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 


ఈ నేపథ్యంలోనే నిరుద్యోగుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా స్థానికుల ఉద్యోగ కల్పనకు ఆంధ్ర ప్రదేశ్ ముందడుగు వేసింది. ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సంస్ధల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


'ఆంధ్ర ప్రదేశ్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ క్యాండేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ యాక్ట్'ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ సంస్ధల్లో 75 శాతం స్థానిక యువతకు అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రతిపక్ష నాయకులు ముక్కు మీద వేలు వేసుకుంటారు అని అంటున్నారు నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి: