ప్రపంచంలో చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు.  అందులోను ప్లాస్టిక్ తో కూడిన వ్యర్ధ పదార్ధాలు అధికంగా ఉంటున్నాయి.  ఈ వ్యర్ధాలతో పర్యావరణం పాడైపోతుందని పర్యావరణ వేత్తలు బాధపడుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు ఝార్ఖండ్ లోని అంబికాపూర్ మున్సిపాలిటీ ఓ వినూత్న ప్రయోగం మొదలు పెట్టింది.  


కిలో చెత్తను తీసుకొచ్చి ఇస్తే కిలో ఆహరం ఇస్తారట.  అలా అకాకుండా అరకిలో చెత్తను ఇస్తే.. అల్పాహారం ఇస్తారట.  పేదల ఆకలి తీర్చినట్టు ఉంటుంది పైగా, మున్సిపాలిటీ పరిధిలో చెత్త లేకుండా చేసినట్టుగా ఉంటుంది.  అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మున్సిపాలిటీ పేర్కొన్నది.  


 ఈ ఐడియా వర్కౌట్ అవుతుండటంతో... ప్రతి ఒక్కరు దీనిని తప్పకుండా ఫాలో అవుతారని అనుకోవచ్చు.  భవిష్యత్తులో ఈ ఐడియాను ఫాలో అయ్యే అవకాశం ఉంది.  దేశంలో వేలాది మున్సిపాలిటీలు ఉన్నాయి.  ఇవి ఈ పద్దతిని ఫాలో అయితే కనుక పేదల కడుపు నిండినట్టు ఉంటుంది.  


దానితో పాటు చెత్తను క్లీన్ చేసినట్టుగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది.  అంబికాపూర్ గార్బేజ్ కేఫ్ సక్సెస్ కావడంతో అక్కడి ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఈ పధకాన్ని మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: