వైఎస్ కుటుంబం అంటేనే విశ్వసనీయతకు మారుపేరుగా మారిపోయింది. దివంగత నేత వైఎస్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా మాట తప్పం..మడమ తిప్పం అనే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో వైఎస్ అయినా ఇపుడు జగన్ అయినా తమను నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయరు అనే నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే రాజానగరం ఎంఎల్ఏ జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్, వైఎస్ ఎంతటి సన్నిహితులో అందరికీ తెలిసిందే. అదే స్నేహాన్ని  వారసులు కూడా కంటిన్యు చేస్తున్నారు. దాని ఫలితంగానే రాజాకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి.

 

మొన్నటి ఎన్నికల విషయంలో  ముందుగా హామీ ఇచ్చిన వారికే జగన్ టికెట్లు ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కిల్లి కృపారాణి, పండుల రవీంద్ర లాంటి మాజీ ఎంపిలు పార్టీలో చేరినా వాళ్ళెవరికీ టికెట్లు హామీ ఇవ్వలేదు. ముందునుండి పార్టీలో కష్టపడిన వారికే టికెట్లిచ్చారు. అలాగే 2009లో తాను పార్టీ పెట్టినపుడు కాంగ్రెస్, టిడిపిలకు రాజీనామాలు చేసి తనకు మద్దతుగా నిలబడిన వాళ్ళకు ఎంఎల్ఏ టికెట్లు ఇచ్చారు. మంత్రివర్గంలో కూడా వారికే ప్రాధాన్యతిచ్చారు.

 

ఇక చంద్రబాబు విషయం చూస్తే పూర్తిగా ఉల్టాగా ఉంటుంది వ్యవహారం. ఏ ఒక్కహామీని కూడా నిలబెట్టుకుంటారన్న గ్యారెంటీ లేదు. ఎదుటి వారితో అవసరం ఉంటుందనుకుంటేనే మాట్లాడుతారు. లేకపోతే పక్కనే ఉన్నా చూడనట్లే వెళ్ళిపోతారు. ఇక పార్టీని నమ్ముకున్న వాళ్ళకన్నా దళారీలకు, ధనబలం ఉన్నవాళ్ళ మాటే వేదం. ఆ విషయం మొన్నటి ఎన్నికల్లో నిరూపితమైంది. కాబట్టే విశ్వసనీయతలో అందరూ చంద్రబాబు-జగన్ ను పోల్చి చూసుకుంటున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: