ఏపీ రాజధాని అమరావతికి భారీ రుణం మంజూరు విషయంలో వెనకడుగు వేసిన ప్రపంచ బ్యాంకు కేవలం రోజుల వ్యవధిలోనే మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కారుకు ఏకంగా బిలయన్ డాలర్ల రుణాన్ని ఆఫర్ చేసింది. అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చే విషయంలో వెనుకంజ వేసిన ప్రపంచ బ్యాంకు మరోవిధంగా రాష్ట్రానికి సాయం చేస్తానంటోంది.


అమరావతి నిధుల విషయంలో ప్రపంచబ్యాంక్ అనూహ్యనిర్ణయం నేపథ్యంలో ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ వంటి వారు జగన్ సర్కారు తీరే ప్రపంచ బ్యాంకు నిర్ణయానికి కారణని విమర్శలు కూడా చేసేశారు. అయితే కేంద్రం చెప్పినందువల్లే అమరావతికి రుణం ఇవ్వలేకపోయామని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.


తాజాగా.. ఏపీలోని నాలుగు కీలక రంగాల అభివృద్ధికి చేయూత ఇస్తామని ముందుకొచ్చింది. వ్యవసాయం, విద్యుత్, ఆరోగ్యం, ప్రకృతి విపత్తులకు భారీగా నిధులు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సర్కారుకు ఉత్తరం రాసిందట. ఈ విషయాన్ని ఏపీ సర్కారు ప్రకటన ద్వారా తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: