చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియాకు ప్రపంచ బ్యాంకు పెద్ద షాకిచ్చింది. వరల్డ్ బ్యాంకు తమకు షాకిస్తుందని  బహుశా ఎల్లో గ్యాంగ్ ఏమాత్రం ఊహించుండదు. అమరావతి నిర్మాణానికి అప్పు ఇవ్వకూడదన్న నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి వస్తుందని అనుకున్న  ప్రపంచబ్యాంకు నుండి అప్పు ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

 

తాము అమరావతి నిర్మాణానికి అప్పు ఇవ్వటం లేదంటూ ప్రపంచబ్యాంకు నాలుగు రోజుల క్రితం స్పష్టం చేసింది.  దాంతో చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు ఎల్లో మీడియా రెచ్చిపోయారు. జగన్ నిర్వాకం వల్లే వస్తుందని అనుకున్న అప్పు ఆగిపోయిందంటూ ఎల్లో గ్యాంగ్ జగన్ పై దండయాత్ర చేస్తోంది.

 

నిజానికి ప్రపంచ బ్యాంకు అప్పు ఆగిపోవటానికి జగన్ కు ఏమీ సంబంధం లేదన్న విషయం ఎల్లో గ్యాంగుకు కూడా బాగా తెలుసు. కానీ ఎన్నికల్లో తమను ఓడించారన్న ఏకైక ధ్వేషంతోనే జగన్ పై చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లో మీడియా తీవ్రంగా వ్యతిరేక ప్రచారానికి పూనుకున్నారు.

 

అప్పు ఇవ్వకూడదన్న నిర్ణయంపై ప్రపంచబ్యాంకు తాజాగా ఓ ప్రకటన చేసింది. తమ నిర్ణయానికి జగన్ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని తేల్చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే తాము అప్పు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు చెప్పారు. దాంతో చంద్రబాబు అండ్ కో కు ఇపుడు ఏం మాట్లాడాలో అర్ధం కావటం లేదు. అందులోను ఈరోజు అసెంబ్లీ సమావేశం కూడా ఉండటంతో జగన్ ను ఫేస్ చేసే విషయంలో టెన్షన్ పడుతున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: