‘అత్తారింటికి దారేది’ సినిమా హిట్టుతో జోరు మీదున్న పవన్ కళ్యాణ్ జీరో అవుతున్నడా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సోదరుడు చిరంజీవి పడ్డ తొందరనే పవన్ కూడా పడుతున్నాడా అన్న సందేహాలు పుడుతున్నాయి. సినిమాల్లో చక్కగా రాణిస్తున్న సమయంలో తప్పడడుగులు వేసేందుకు సిద్దమయ్యాడా పవన్ అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయంటున్నారు.

దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో పవన్ రాజకీయ ప్రస్థానంపై ఓ కథనం వచ్చింది. అదేంటంటే పవన్ ఇప్పటికి టిడిపి నేతలతో టచ్ లో ఉన్నాడని ఆ కథనం సారాంశం. ఓ వైపు కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనతో సన్నిహితులతో మంతనాలు, మరో వైపు టిడిపితో స్నేహ సంబందాలు కొనసాగించడంలో పవన్ అసలు అంతరంగమేంటి అన్నది అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఎన్నో ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న హేమాహేమీలను, రాజకీయ పార్టీలను దిక్కు తోచని స్థితిలో పడేసిన తరుణం ఇది. ఈ సమయంలో కరడుగట్టిన రాజకీయులే ఏమి చేయాలో తెలియక మౌనంగా ఉంటున్న సమయం, ఈ తరుణంలో రాజకీయాల్లోకి రావడమనేదే ప్రమాదకరం, పైగా అటో, ఇటో తేల్చుకోకుండా డబుల్ గేమ్ ఆడే ప్రయత్నం ఇంకా డేంజర్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

పైగా పవన్ ఇప్పుడు సినిమాల్లో మంచి ఊపుమీదికి వచ్చాడు, ఇంకా ఆయన చేతిలో బిగ్ హిట్లు ఇచ్చి ఆయన ఇమేజిని ఆకాశానికి తీసుకువెల్లేంత సినిమాలున్నాయి. వయసు కూడా  తక్కువే, సినిమాల్లో ఇంకా వెలుగువెలిగే అవకాశాలున్నాయి. ఇప్పుడు రాజకీయాల్లోకి రాకుండా తన ఇమేజిని పెంచుకుని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక పవన్ తన రాజకీయంపై ఆలోచిస్తేనే బాగుంటుందని, ఇప్పుడు ఎవరో ఎగవేస్తే తొందరపడి రాజకీయాల్లోకి వస్తే ఆయన పరిస్థితి కూడా జీరో అవుతుందేమోనన్న భావననే సర్వత్రా వ్యక్తమవుతోంది, ఇంతకీ పవన్ ఏం చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: