రోజు రోజుకి ఉగ్రవాదుల చర్యలు ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రపంచ శాంతి కోసం అగ్రరాజ్యాలు సైతం కృషి చేస్తుంటే,ఉగ్రవాదులు మాత్రం ప్రపంచ నాశనానికి పట్టుబట్టారు. ప్రతి రోజు పేదరికంలో మగ్గి,బ్రతుకు సాగించడమే కష్టంగా ఉన్న పేద ప్రజలు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిని కనీసం బ్రతికే అర్హత లేదని ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చుతున్నారు.

 సోమాలియా రాజధాని మొగాదిషులో కారుబాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 17 మంది మరణించగా 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. విమానాశ్రయానికి సమీపంలోని చెక్ పాయింట్ వద్ద కారు నిలిపివుంచి. రిమోట్ కంట్రోల్ సాయంతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని తామే చేసినట్టుగా ఆల్ఖైదా తో జత కట్టిన స్వదేశీ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఒక్క ముక్క దాడికి ప్రజలు భయభ్రాంతులయ్యారు.
 
అసలు ఉగ్రవాదులు ఇటువంటి చర్యలు ఎందుకు చేస్తారు సామాన్య ప్రజలను ఎందుకు బలి తీసుకుంటారు అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు, కేవలం అధికార ప్రభుత్వాన్ని, అగ్రరాజ్యాన్ని భయ పెట్టడం కోసం సామాన్య ప్రజల్ని హతమరుస్తున్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టలేం అని అగ్రరాజ్యాలే చేతులు ఎత్తేశాయ్ కానీ ఉగ్రవాద చర్యల్ని అరికట్టొచ్చు కదా అనేది సామాన్యుడి ఆవేదన.


మరింత సమాచారం తెలుసుకోండి: