తాజాగా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రానికి చేసిన ద్రోహం గుర్తుకొస్తోంది. ఎన్టీయార్ కూతురుగా రాజకీయాల్లోకి ప్రవేశించిన పురంధేశ్వరి కాంగ్రెస్ లో చేరి విశాఖపట్నం ఎంపిగా రెండుసార్లు గెలిచారు. రెండోసారి ఆమె కేంద్రమంత్రిగా ఉన్న కాలంలోనే రాష్ట్ర విభజన జరిగింది.

 

విభజన సమయంలో కేంద్రమంత్రిగా ఉండికూడా ఏపికి ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్ ను సాధించలేని చేతకాని మంత్రిగా ముద్ర వేసుకున్నారు. మంత్రిగా ఫెయిల్ అయిన ఈ మాజీ మంత్రి తర్వాత బిజెపిలో చేరి ఇపుడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధులు చెబుతున్నారు.

 

రాష్ట్ర విభజన సమయంలో నాటి యూపిఏ ఇచ్చిన హామీలను ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంతో అమలు చేయించాల్సిన పురంధేశ్వరి హోదాపై జగన్ జనాలను మోసం చేస్తున్నారంటూ నీతులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసింది నాటి యూపిఏ, ప్రస్తుత ఎన్డీఏనే అన్న విషయం జనాలకు బాగా తెలుసు. అందుకనే మొన్నటి ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపిగా పోటీ చేసిన పురంధేశ్వరికి కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు.

 

ప్రజల మనోభావాలను, సెంటిమెంటును లెక్కచేయకుండా హోదా విషయంలో కేంద్రానికి మద్దతుగా నిలబడినంత కాలం ఎంతమంది పురంధేశ్వరిలు వచ్చిన బిజెపికి ఏపిలో పది సీట్లు కూడా రావన్నది వాస్తవం. హామీ మేరకు హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడక్కుండా జగన్ మోసం చేస్తున్నాడని చెప్పటమంటే తానే ఏపికి ద్రోహం చేస్తున్నట్లు పురంధేశ్వరి గుర్తించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: