ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల కమిటి ఛైర్మన్‌గా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఎంపికయ్యారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీ. తెలుగుదేశం పార్టీలో ఈ పదవి కోసం చాలా పోటీ ఉన్నా.. చివరకు చంద్రబాబు పయ్యావుల కేశవ్ ను ఎంపిక చేశారు.


ప్రతిపక్షానికి దక్కే కేబినెట్ ర్యాంకు పదవుల్లో ఇదీ ఒకటి. ఇప్పుడు పయ్యావుల కేశవ్ కేబినెట్ ర్యాంకు హోదాతో ఈ పదవిలో ఉంటారు. ప్రతిపక్ష పార్టీకి ప్రజాపద్దుల కమిటీ ఓ అస్త్రం. ప్రభుత్వ లెక్కల్లోని డొల్లతనాన్ని బయటపెట్టే అవకాశం ఈ పదవి ద్వారా లభిస్తుంది.


ఈ పదవి కోసం టీడీపీలో సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గంటా శ్రీనివాసరావు వంటి వారు చివరి వరకూ తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి చంద్రబాబు పీఏసీ చైర్మన్ పదవి పయ్యావుల కేశవ్ ను ఎంపిక చేశారు.


టీడీపీలో మంచి వాయిస్ ఉన్న నేతల్లో పయ్యావుల కేశవ్ ఒకరు. పాపం.. ఈయన 2014 ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అయ్యేవారు... కానీ అప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు ఆయన గెలిచినప్పుడు పార్టీ అధికారం కోల్పోయింది. పోనీ..ఇలాగైనా పీఏసీ పదవితోనైనా పయ్యావులకు కేబినెట్ హోదా దక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి: