వైకాపా మీద గురి పెట్టిన బిజెపి తాము ఎవరికేమి మిత్రపక్షం కాదు ఏపీలో జెండా ఎగరేస్తాం అంటోంది. నగరి నుంచి పంచాయతీ మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది అందుకే సౌత్ లో పాపులర్ అయిన ఆ హీరోయిన్ ఏరికోరి బిజెపికి తెస్తుంది.  ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాస్తో కూస్తో పుంజుకునే ప్రయత్నంలో ఉన్న బిజెపి మొదటి అడుగు వేసేసింది, వేస్తే వేసింది కాని నేరుగా రోజాకు ఎక్కుపెట్టాలని ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తుంది.

ఎందుకంటే అలనాటి హీరోయిన్ ప్రియారామన్ ని రంగంలోకి దించుతోంది. రోజా హీరోయిన్ గా ఉన్న సమయంలో ఆమె కూడా కథానాయిక. రోజా కేవలం తెలుగు, తమిళ్లోనే ఉందేమో ప్రియారామన్ కన్నడ మలయాళం లో గడిపి ఏడు భాషల్లో పాపులర్. పైగా ఏడు భాషలు మాట్లాడగలదు కూడా అందుకే ఆమె రాకని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.

ఆమె స్క్రిప్టు లేకుండా నేరుగా మాట్లాడగలదని, ఏపీలో పోటీ చేయాలని కోరుకుంటున్నారని బిజెపి వాళ్ళుంటున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆమె నగరిలో ఎందుకు దిగుతోంది అంటే దానికీ లాజిక్ ఉంది ప్రియారామన్ పీఏ చలపతి సొంతూరు నగరి అక్కడ ఆయనకి నెట్వర్క్ ఉందట పైగా అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు.

ఇంకో మాట వ్యూహాత్మకం గా చూసినా అది చంద్రబాబు సొంత జిల్లా పైగా సీమలో ప్రచారానికి తిప్పడానికి చిత్తూరయినా వాటంగా కుదురుతుంది. అటు రోజాకు చెక్ పెట్టడం తో పాటు రాజకీయ వ్యూహం లో భాగంగా కూడా ప్రియారామన్ అక్కడి దిగితేనే బెటరని అనుకుంటున్నట్టుగా చెప్తున్నారు. మరి ఆమె స్వయంగా ప్రకటించే అవకాశం ఉంటుందేమో చూడాలి ఇక.

రోజా ని దెబ్బకొట్టడానికి ప్రియారామన్  వంటి వారిని నగరిలో దింపుతోంది అక్కడ టీడీపీ లేదా అంటే బ్రహ్మాండంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఉండేది. మొన్న ఎన్నికల్లో గాలి బ్రదర్స్ ఇద్దరూ  రోజాను సూపర్ గా  గెలిపించారు అలాంటి పరిస్థితి వస్తుందని పార్టీ నాయకత్వాన్ని కొన్ని నెలల ముందే చెప్పిన మొహమాటానికి పోయి ఇంత వరకూతెచ్చుకున్నారని వాదన. 


మరింత సమాచారం తెలుసుకోండి: