ఏపీ సర్కారు అనూహ్యమైన నిర్ణయాలు రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి రాకుండా మూడు ఛానళ్లను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈ టీవీ ఛానల్స్‌ను అసెంబ్లీలోకి అనుమతించేది లేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి చప్పడం వివాదానికి తావిచ్చింది. జగన్ 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీ అమలు చేయాలని అసెంబ్లీలో పెద్ద రగడ జరిగింది. ఈ క్రమంలోనే ముగ్గురు టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడులపై సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే .

వీరు బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమపై అసెంబ్లీలో అన్యాయంగా వేటు వేశారని, తాము తమ సీట్లలో ఉన్నా తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం ఇలా చేసిందని ఫైర్ అయ్యారు. ఆ సమయంలో లోపల అసెంబ్లీ జరుగుతోంది. కొన్ని ఛానెల్స్ మాత్రం బయట వీరి ప్రసంగాన్ని లైవ్ ఇచ్చాయి. ఇలా చేయడం .. నిబంధనలకు విరుద్ధమని చెబుతూ. మూడు చానళ్లపై బ్యాన్ వేసేశారు. వాస్తవంగా ఇది మరి అంత తప్పేం కాదన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.

గతంలో  కూడా వైఎస్ ప్రభుత్వంలోనూ అసెంబ్లీలో సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వనప్పుడు వారు బయటకు వచ్చి మాట్లాడేవారని పలువురు వాపోయారు. అప్పుడు ఛానెల్స్ వాటిని బాగా హైలెట్ చేసేవని అన్నారు. ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా లోపల అసెంబ్లీ జరుగుతుండగా బయట మీడియా పాయింట్ నుంచి ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వకూడదని.. నిబంధన తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: