కేశినేని ట్రావెల్స్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను ఎంపీ కేశినేని నాని ఖండించారు. ట్రావెల్స్‌లో పనిచేసిన ఎవరికీ బకాయి పడలేదని స్పష్టం చేశారు. గుంటూరు లేబర్ కోర్టులో 14 మంది మాత్రమే కేసు పెట్టారని, కోర్టు ఆదేశాల మేరకు నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని నాని స్పష్టం చేశారు. నిజంగా బకాయిపడ్డట్లు ఆధారాలు చూపిస్తే, వారికి రావాల్సిన మొత్తాన్ని  సెటిల్ చేస్తానని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


వందలాది మందికి జీతాలు ఇవ్వలేదని ట్వీట్లు చేస్తున్నవారు.. ఆ వందల మంది కార్మికులు ఎవరో చూపించాలని సవాల్ విసిరారు. ఎవరి ట్వీట్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని నాని స్పష్టం చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లిన కేశినేని ట్రావెల్స్ కార్మికులు , శుక్రవారం ఉదయం అక్కడ ధర్నా కు దిగిన విషయం తెల్సిందే . తమకు బకాయి పడిన వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు . 90 ఏళ్ల చరిత్ర కలిగిన కేశినేని ట్రావెల్స్ ను గత ప్రభుత్వ హయాం  రవాణాశాఖ కమిషనర్ తో జరిగిన గొడవ అనంతరం  మూసి వేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు.


కేశినేని ట్రావెల్స్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన కేశినేని నాని తమకు జీతాలు చెల్లించలేదని కొంతమంది కార్మికులు  కోర్టును ఆశ్రయించడం హాట్ టాఫిక్ గా మారింది . అయితే ట్రావెల్స్ లో పని చేసిన వారికి ఎవరికీ తాను బకాయి లేనని కేశినేని నాని అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: