తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్నకు బిజెపి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ పార్టీలో చేరాలంటూ వెంకన్నను  బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు  కోరారు. శాసనమండలి లాబీల్లో ఇద్దరూ ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ వెంకన్నను తమ పార్టీలోకి వచ్చేయాలంటూ కోరారు.

 

తమ పార్టీ అధికారంలోకి రాగానే మీకు మంత్రి పదవి కూడా గ్యారెంటీ అంటూ వెంకన్నకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అందుకు వెంకన్న స్పందిస్తు రెండు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిపదవులు పంచుకుందామని సూచించారు. దానికి సోము ఒప్పుకోలేదనుకోండి అది వేరే సంగతి.

 

పోయిన ఎన్నికలకు ఏడాది ముందు వరకూ రెండు పార్టీలు కలిసే ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఇద్దరు విడిపోయి మొన్నటి ఎన్నికల్లో వైసిపి చేతిలో చావు దెబ్బతిన్నారు. అసలే ఘోరంగా దెబ్బతిన్న టిడిపిని మరింత చితకొట్టటమే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని వీర్రాజు బాహాటంగానే చెప్పటం గమనార్హం. టిడిపి చితికిపోతేనే బిజెపి బలపడుతుందనేది వీర్రాజు థియరీ.

 

ఇక్కడ వీర్రాజు మరచిపోయిన విషయం ఒకటుంది. ఇతర పార్టీల నుండి నేతలను చేర్చుకున్నంత మాత్రాన బిజెపి బలం పెరగదు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటి హామీలను నెరవేరిస్తే ఇతర పార్టీల నుండి గట్టి నేతలు వాళ్ళంతట వాళ్ళుగానే వస్తారు. అప్పుడేమైనా బిజెపి బలంగా తయారవుతుందేమో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: