జనసేన తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అయితే ఇతను జనసేన ఎమ్మెల్యేనా లేక వైసీపీ తరపున గెలిచాడా అనే సందేహం రాక మానదు ఎవరికైనా .. ఒకానొక సమయంలో జగన్ గురించి భజన వైసీపీ నాయకుల కంటే రాపాక భజనే ఎక్కువని చెప్పాలి. అయితే ఆయన తీరు ఇప్పటికే జనసైనికులకు ఏమాత్రం నచ్చడంలేదని తేలిపోయింది. బహుశా పవన్ కల్యాణ్ కు కూడా ఆయన తీరు అంతగా నచ్చినట్టుగా లేదు. అందుకే ఆయనకు పొలిట్ బ్యూరోలో స్థానమే ఇవ్వలేదు!


తాజాగా అనౌన్స్ చేసిన జనసేన పొలిట్ బ్యూరో లో రాపాక వరప్రసాద్ కు స్థానం దక్కపోవడం గమనార్హం. నాదెండ్ల మనోహర్, రామ్మోహన్ రావు, రాజు రవితేజ, అర్హాంఖాన్ లకు పొలిట్ బ్యూరోలో స్థానం దక్కగా, రాపాకకు మాత్రం అందులో స్థానం కల్పించలేదు. ఏ పార్టీ అయినా పొలిట్ బ్యూరోలో కీలక నేతలకు స్థానం కల్పిస్తుంది. జనసేన కోణం నుంచి చూస్తే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గిన ఏకైకవ్యక్తి రాపాక. రాపాక వ్యవహారం పవన్ కళ్యాణ్ కు కూడా నచ్చడం లేదని ఇంత కంటే నిదర్శనం ఇంకేమి కావాలని చాలా మంది భావిస్తున్నారు. 


అయినప్పటికీ ఆయనకు పొలిట్ బ్యూరోలో స్థానం దక్కకపోవడం గమనార్హం. ఇక ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన నాదెండ్లకు మాత్రం పొలిట్ బ్యూరోలో స్థానం దక్కింది. అలాగే ఆయనను పొలిటిక్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ ను కూడా చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో మాత్రం రాపాకకు స్థానం దక్కింది. ఆయనతో పాటు నాగబాబు తదితరులు అందులో సభ్యులుగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల నుంచి రాపాక వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ అవన్నీ అపోహలు మాత్రమేనని రాపాక కొట్టిపారేశారు. ఏది ఏమైనా నేను పవన్ తోనే ఉంటానని చెప్పుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: