ఇచ్చిన మాటను నెరవేర్చేదాకా జగన్ కనీసం నిద్రకూడా పోడు మా నాయకుడు అంటూ ఆ పార్టీ నేతలు భజనలు చేస్తుంటారు. అలాగే చేయాలనీ అందరికి చెబుతుంటారు. అయితే క్షేత్ర స్థాయిలో జరుగుతున్నా పరిణామాలు గమనిస్తే మాత్రం జగన్ ఇక మీదట మాట తప్పటం,మడమ తిప్పటం లాంటి మాటలు ఆపేస్తే మంచిదనే చెప్పాలి. వడ్డీ లేని సున్నా రుణాలు ఇస్తానని దాని కోసం 3500 కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడు, కానీ బడ్జెట్ లో కేవలం 100 కోట్లు మాత్రమే దానికి కేటాయించారు. ఒక్కప్పుడు కేసీఆర్ ని హిట్లర్ అని విమర్శించినా జగన్, నేడు అదే కేసీఆర్ కి అగ్రతాంబూలం ఇస్తున్నాడు.


మద్యపాన నిషేధం అంటూ మాట్లాడి దశల వారీగా నిర్ములిస్తామని చెపుతూనే, గత ప్రభుత్వం కంటే ఈసారి ఎక్కువగా మద్యం అమ్మకాల ద్వారా ఎక్కువ రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఎస్పీ,ఎస్టీ, మైనారిటీ మహిళకు 45 ఏళ్లకే పెన్షన్ అంటూ సాక్షిగా కధనాలు రాయించుకున్న జగన్. ఇప్పుడు వాటిని ఎక్కడ నెరవేర్చాడో చెప్పాలి. అధికారం లేనప్పుడు వంద మాట్లాడుతాం, అధికారం వచ్చిన తర్వాత అన్ని పనులు చేయాలంటే కుదరాలి కదా అని అనుకోవచ్చు, అలాంటి సమయంలో అసలు మాట తప్పటం,మడమ తిప్పటం లాంటి డైలాగులు ఎందుకు..వాటిని ఆపేస్తే మంచిది.


 లేకపోతె జగన్ కి కూడా బాబుకి పట్టిన గతే పడుతుంది. నిజానికి బాబు బాగానే పాలించాడు. కానీ ప్రజలు ఇంకా లబ్ది పొందాలని ఆశ పడుతున్నారు. అందుకే అలాంటి లబ్ది చేకూరుస్తానని జగన్ ఎన్నికలకు ముందు చెప్పాడు. ఆ మాటలు నమ్మి జగన్ ను గెలిపించారు.  ఇప్పుడు ఆ మాటలు మర్చిపొతే  వచ్చే ఎన్నికల్లో జగన్ ను  ఓడిస్తారు. జగన్..   అప్పుడు బాధ పడి ప్రయోజనం లేదు.         


 




మరింత సమాచారం తెలుసుకోండి: